CM Revanth Reddy: CM Revanth Reddy: క్రీడాకారులకు గుడ్ న్యూస్
CM Revanth Reddy (imagecredit:AI)
Telangana News

CM Revanth Reddy: క్రీడాకారులకు గుడ్ న్యూస్.. కొత్తగా 8 స్టేడియాలు.. ఎక్కడంటే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: CM Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లోని ఔత్సాహిక క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు సిద్దమైంది. ముఖ్యంగా దేశంలోనే అయిదవ అతి పెద్దనగరంగా చెప్పుకునే హైదరాబాద్ మహానగరంలో భారీ స్థాయిలో ఒక్క ఫుట్ బాల్ స్టేడియం కూడా లేకపోవటంతో ఫుట్ బాల్ క్రీడాకారులకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహాం లభించటం లేదన్న విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరానికి పేరుకు తగ్గట్టు ఫుట్ బాల్ స్టేడియంలను అందుబాటు తెచ్చే దిశగా స్థలాలను గుర్తించాలన్న సీఎం రేవంత్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని తిరుమలగిరి, షేక్ పేట, కూకట్ పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఎనిమిది ఏరియాల్లో అయిదు ఎకరాలకు మంచి ఉన్న స్థలాలను జీహెచ్ఎంసీ గుర్తించింది.

Also Read: Sri Sathya Sai District: హోం వర్క్ రాయకుంటే.. రాయించాలి.. చెప్పుతో కొడతారా?

ఫుట్ బాల్ స్టేడియంలకు సంబంధించి స్థలాలను గుర్తించి, సిద్దంగా ఉండాలన్న సర్కారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సుమారు కనిష్టంగా 6 వేల మంది, గరిష్టంగా ఎనిమిది వేల మందికి సిట్టింగ్ కెపాసిటీ ఉండేలా ఈ స్థలాలను ఎంపిక చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న ఎనిమిది ప్రాంతాల్లో జోన్ కు ఒకటి చొప్పున ఆరు ఫుట్ బాల్ స్టేడియంలను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు సమాచారం.

ఆధునిక హంగులతో స్టేడియంలు

జీహెచ్ఎంసీ గుర్తించిన వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నఆరు ఫుట్ బాల్ స్టేడియంలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక హంగులతో ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సమాచారం. ఒక్కో స్టేడియం ఏర్పాటుకు రూ.80 కోట్ల వరకు ఖర్చవుతుందని, వీటిలో సిట్టింగ్ వ్యవస్థ, ఫ్లడ్ లైట్లతో పాటు ఇతర క్రీడల్లో కూడా శిక్షణనిచ్చేలా వెసులుబాటు కల్పించేలా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగానే అంచనాలు సిద్దం చేసినట్లు తెలిసింది. కొత్త ఫుట్ బాల్ స్టేడియంల ఏర్పాటుకు సంబంధించి కూడా సర్కారే నిధులు కేటాయిస్తుందని జీహెచ్ఎంసీ భావిస్తుంది.

తొలుత నగరం నడి బొడ్డున ఉన్న లాల్ బహద్దూర్ స్టేడియం ను ఫుట్ బాల్ స్టేడియంగా మార్చాలన్న విషయం తెరపైకి రాగా, అది క్రికెట్ అయితేనే అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని సర్కారుకు విన్నవించకగా, ఫుట్ బాల్ స్టేడియంల ఏర్పాటుపై సీఎం స్పెషల్ నజర్ పెట్టారని, జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో ఆరు స్టేడియంల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని సూచించటంతో, అధికారులు ఎనిమిది చోట్ల స్థలాలను గుర్తించినట్లు తెలిసింది.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క