CM Revanth Reddy (Image Source: reporter)
తెలంగాణ

CM Revanth Reddy: హనుమకొండలో సీఎం రేవంత్ పర్యటన.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఫ్యామిలీకి పరామర్శ

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బుధవారం పరామర్శించారు. దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఇటీవల మరణించన నేపథ్యంలో కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్ లో మాతృ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రత్యేక హెలికాప్టర్ లో..

అంతకుముందు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి హనుమకొండకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో దిగిన సీఎం రేవంత్ రెడ్డికి.. రాష్ట్ర మంత్రి సీతక్క, పలువురు ఎంపీలు, కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి రోడ్డు మార్గంలో పీజీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

Also Read: Shocking Video: బస్సు కిందపడబోయిన బైకర్.. హీరోలా కాపాడిన కానిస్టేబుల్.. ఎలాగో మీరే చూడండి!

చిత్రపటానికి పూలమాలలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు దొంతి కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దొంతి మాధవ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం చేరుకుని హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Also Read: Dammu Srija: వాడు, వీడు అంటూ నాగ్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీజ.. వీడియో వైరల్!

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?