Gongidi Trisha
తెలంగాణ, స్పోర్ట్స్

Gongadi Trisha | మహిళా క్రికెటర్ త్రిషకి భారీ నజరానా ప్రకటించిన సీఎం

మహిళా క్రికెటర్ గొంగడి త్రిష (Gongadi Trisha) జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను సీఎం అభినందించారు. భవిష్యత్ లో దేశం తరుపున ఆడి మరింతగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే త్రిషకి ప్రభుత్వం తరపున సీఎం కోటి రూపాయల నజరానా ప్రకటించారు.

త్రిష తోపాటు తెలంగాణ కు చెందిన అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్ ధృతి కేసరి కి రూ. 10 లక్షలు, అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున సీఎం నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్