cm revanth
తెలంగాణ

Cm Revanth : రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ ఫోకస్.. ఏం జరగనుంది..?

Cm Revanth : వరంగల్ స్వేచ్ఛ : ‘స్వేచ్ఛ’ చెప్పినట్లే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవినీతిపై ఫైట్ చేసిన రాజలింగమూర్తి (Rajalingamurthy), అడ్వకేట్ సంజీవరెడ్డి మరణాలపై ప్రశ్నలు గుప్పించారు. ‘కేటీఆర్ (Ktr) అన్నింటిపై విచారణ అడుగుతున్నారు. కాళేశ్వరం అవినీతిపై ఫైట్ చేసిన వారి హత్యలపై ఎందుకు అడగటం లేదు’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

వారి మరణాలపై కూడా విచారణ జరపుతామని సీఎం చెప్పడంతో కేసు మళ్లీ హీటేక్కింది. మొదటి నుంచి మూర్తి హత్యను స్థానిక నేతలు పార్టీలకు అతీతంగా ఏకమై తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేతల ఒత్తిళ్లతో పోలీసులు కేసును లైట్ తీసుకుంటున్నారని చెప్పడానికి వాళ్లు వ్యవహరించిన తీరే నిదర్శనం. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న బీఆర్ఎస్ నేత, మాజీ వైస్ ఛైర్మన్ హరిబాబుని వారం రోజులైనా అరెస్ట్ చేయలేదు. మరో ఇద్దరు నిందుతుల ఆచూకీ కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు.

రాజలింగమూర్తిని చంపింది ఎకరం భూమి కోసం కాదని.. భూస్వాముల భూములకు అడ్డుపడుతుండటంతో వంశీకృష్ణ అనే వ్యక్తిపై కూడా అనుమానాలు ఉన్నాయి. అతను హైదరాబాద్ లో ఉంటూ హత్యకు ముందు నిత్యం భూపాలపల్లికి వెళ్లివస్తుండేవాడు. అతనిపై మొదట్లో చాలానే అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే లింగమూర్తిపై రౌడీషీట్ ఓపెన్ చేయించిందే ఈ వంశీకృష్ణ. నిందితులను ఆలస్యంగా అరెస్ట్ చేస్తే సాక్ష్యాదారాలను తారు మారు చేసే అవకాశాలు ఉంటాయి.

సీఎంవో ఆఫీస్ ఆరా తీస్తుందనే సమాచారం ఉన్నా.. అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను కస్టడీకి కోరలేదు పోలీసులు. కనీసం పిటిషన్ కూడా రెడీ చేయలేదని తెలుస్తోంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసుల నుంచి అటు డీజీపీ ఆఫీస్ గానీ ఇటు సీఎంవో గానీ సమాచారం కోరకపోవడం స్థానికంగా అనుమానాలకు తావిస్తోంది. రాజలింగం హత్య జరిగిన రోజే అడ్వకేట్ సంజీవరెడ్డి మృతిపై స్వేచ్ఛ పేపర్ అనుమానాలను ప్రజల ముందు ఉంచింది. ఇలాంటి కేసులో కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చురకలు అంటించడంతో.. మున్ముందు ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు