revanth-vs-kishan-reddy
తెలంగాణ

CM Revanth: కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్; ఏకంగా తొమ్మిది పేజీల లేఖ

CM Revanth: తెలంగాణలో 2023, డిసెంబర్ 7 ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య విధానానికి కట్టుబడి ఉండి దానినే అనుసరిస్తున్నామని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీఎం అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన ఖండించారు. ఈ మేరకు తొమ్మిది పేజీల బహిరంగ లేఖను విడుదల రాశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతను గుర్తు చేయడం కోసమే ఈ లేఖను రాస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో పూర్తి భాద్యతాయుతంగా పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, ప్రాంతీయ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రైలు, డ్రై పోర్టు నుంచి ఏపీలోని బందరు సీ పోర్టుకు గ్రీన్ ఫిల్ఢ్ రహదారి నిర్మాణాలకు సంబంధించి అనుమతుల సాధనకు సంబంధించి అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు పూర్తిగా పాటిస్తున్నాం. ఈ విషయం మీకు స్పష్టంగా తెలుసు. ఆయా ప్రభుత్వ ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కలిసిన విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. అని లేఖలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మెట్రో, మూసీ, ఆర్ఆర్ఆర్ తదితర ప్రాజెక్టుల అనుమతుల గురించి ఏయే సందర్భాల్లో ప్రధాని మోదీని, ఇతర మంత్రులను, కిషన్ రెడ్డి గారెని కలిసింది సీఎం రేవంత్ వివరించారు. అయినా కూడా తాను అవగాహాన రాహిత్యంతో మాట్లాడుతున్నానని, విధానాలు అనుసరించడం లేదని వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.

 

Just In

01

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Crime News: మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు అరెస్ట్..!

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?