Cm Revanth : కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసు వేసిన రాజలింగమూర్తి (Rajalingamurthy) హత్యకు గురయ్యాడని, ఆ కేసును వాదిస్తున్న సంజీవరెడ్డి కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు, బిజినెస్ పార్ట్ నర్ అయిన కేదార్ (Kedar) దుబాయ్ లో అనుమానాస్పదంగా చనిపోయాడని.. ఈ మూడు అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేదార్ మరణానికి కారణం ఏంటో కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ అవినీతి చుట్టూ ఉన్న వారంతా ఏదో ఒక రకంగా చనిపోవడం చాలా అనుమానాలకు తావిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రైల్వే విస్తరణ, డ్రైపోర్టు, రక్షణ రంగాలపై చర్చించినట్టు వివరించారు. ఇన్ని రోజులు కేంద్ర కేబినెట్ ముందుకు మెట్రో విస్తరణ బిల్లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారంటూ సీఎం రేవంత్ ఆరోపించారు.