Chukka Ramulu: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నామని ,ప్రజలకు ఏమి సమస్యలు లేవని గొప్పలు చెప్పుకుంటుదని సమస్యలతో గ్రామాల్లో సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి కన్పించడం లేదా అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు (Chukka Ramulu) అన్నారు. కేవల్ కిషన్ భవనంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా అయ్యరు. ఈ సందర్భంగా చుక్క రాములు(Chukka Ramulu) మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు స్థానికంగా ఎదుర్కొనే సమస్యల పై క్యాంపియన్ చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ జిల్లా(Medak District)లో ఆగస్టు 4 వ తేదీ నుంచి స్థానిక సమస్యలను అధ్యయనం చేయడానికి క్యాంపియన్ చేస్తున్నామని అన్నారు.
Also Read: Male Nurses: మేల్ నర్సింగ్ లకు ప్రమోషన్లు లేవా.. మాకు ఎదురు చూపులేనా!
మెన్ రోడ్డు లేక ఇబ్బందులు
సిపిఎం(CPIM) ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సమస్యల క్యాంపియన్ లో ప్రజలు ప్రతి గ్రామంలో మురుగు నీటి కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూన్నారన్నారు.గ్రామ పంచాయతీ లకు బడ్జెట్ లేక పరిశుద్య లోపం తో గ్రామాలలో చెత్త, చెదారం పెరిగి పోతుందన్నారు. పరిశుద్య పనుల కోసం గ్రామాలలో తిరిగే గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లు తిరగడం లేదన్నారు. దీంతో ఇళ్లల్లలోని చెత్తను రోడ్డుపై వేస్తున్నారని, దోమలు,ఈగలు పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. గ్రామాలలో మెన్ రోడ్డు లేక ఇబ్బందులు పడుతూన్నారన్నారు వెల్దుర్తి మండలంలోని అందుగుల పల్లి, చిల్లపచేడ్ మండలం అజ్జమర్రి గ్రామాలలో బస్ సౌకర్యం లేదన్నారు. గతంలో బస్ సౌకర్యం కోసం వెల్దుర్తి నుండి మెదక్ కలెక్టరేట్ వరకు, అజ్జమర్రి గ్రామం నుండి చిలప్ చెడ్ మండలం వరకు పాదయాత్రలు చేయడం జరిగిందన్నారు.
ప్రజలు అనారోగ్యం
కూల్చారం మండలంలోని రాంపూర్ ఇంద్రాకాలనీలో మెయిన్ రోడ్డు ను అనుకుని ప్రైమరీ స్కూల్ వరకు పెద్ద మురుగు నీటి కాలువ ఉంది దాన్ని ప్రభుత్వం నిర్మాణం చేయక పోవడం తో అక్కడ దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. 10 వార్డులు ఉంటే కేవలం 4 వార్డులకు మాత్రమే మురుగు నీటి కాలువలు ఉన్నాయని అన్నారు. రాంపూర్ లోని ఇంద్రా కాలనీ,అప్పాజీ పల్లి,కిస్టాపూర్ వంటి గ్రామాలలో మురుగు నీటి కాలువలు లేక పోవడం తో ఇళ్లలో వాడుకున్న నీటిని బయటకు వెళ్ళే మోరీలు లేక ఇబ్బందులు పడుతూన్నారన్నారు. కిస్టాపూర్ లోని మల్లిఖార్జున ఎల్లమ్మ కాలనీలో డ్రనేజీ , సమస్య, సి సి రోడ్డు సమస్య తీవ్రంగా ఉందన్నారు. గత 7,8 సంవత్సరాల నుండి గ్రామాలలో ఆసరా పెన్షన్ ,వృద్ధాప్య పింఛన్లు,వితంతు పెన్షన్ల కు అర్హులుగా ఉన్నవారు అనేక మంది ఉన్నారన్నారు.
ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటే దశల వారీగా బిల్లులు 5 లక్షల వరకు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకుంటుంది తప్ప బెస్మిటు బిల్లులు ఇప్పటి వరకు చెల్లించక పోవడం తో ఇల్లు కూలగొట్టి, బిల్లులు రాకా ఆర్ధిక ఇబ్బందులు పడుతూన్నారన్నారు. గ్రామాలలో ఉండే పల్లె దవాఖానలు,ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ సిబ్బంది లేక స్టాప్ నర్సు ఒక్కరు మాత్రమే ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు.ప్రజలు ఒకవైపు ఇన్ని రకాల సమస్యలు గ్రామాలలో ఎదుర్కొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ,ఆయా అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా చూస్తూ ఉందన్నారు.
సమస్యలను పరిస్కరించాలి
గ్రామాలలో పని చేసే గ్రామ పంచాయతీ కార్మికులకు,అంగన్వాడి,ఆశలకు ప్రతి నెల జీతాలు కూడా రెగ్యులర్ గా చెల్లించడం లేదన్నారు.గ్రామాలలో అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా,కార్మికులకు ప్రతి నెల జీతాలు చెల్లించకుండా కేవలం కార్పొరేట్ లకు,పెద్ద పెద్ద అధికారులకు మాత్రం ప్రతి నెల జీతాలు చెల్లిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని,లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి భవిస్యతులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు అడివయ్య ,జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ,కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.మల్లేశం,బాలమని,కె.మల్లేశం,జిల్లా కమిటీ సభ్యులు కె నాగరాజు,జె.సంతోష్, ch గౌరయ్య,ప్రవీణ్,నాయకులు లహరి,మంజుల,దాసు,తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad Commissionerate: బడా బాబులకు సహకరిస్తున్న అధికారులు.. అడ్డగోలు సంపాదనలు