kite Accident: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబు మోహన్(Babu Mohan) కాలనిలో గాలిపటం ఎగిరేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరికీ గాయాలు అయ్యాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన నీరజ్, మనోజ్ అనే యువకులు స్థానిక పరిశ్రమలో పని చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్బంగా గురువారం అద్దెకు ఉన్న భవనంపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో చైనా మాంజ విద్యుత్ తీగలకు తగిలింది. దింతో ఇరువురు యువకులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్(BRS) నాయకులు నామ రవికిరణ్(Ravi Kiran) వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్(Hyderabad) లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ-2 శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
నిషేధిత చైనా మాంజ సీజ్..
నిషేధిత చైనా మాంజ స్టాక్ చేసి ఉంచిన గోదాం పై పోలీసులు రైడ్ చేసారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి స్త్రీట్లో ని గోదాంలో 1000 రీల్స్ స్టాక్ తో కూడిన చైనా మాంజను సీఐ శివలింగం ఆధ్వర్యంలో గురువారం స్వాదినం చేసుకున్నారు. వీటి విలువ లక్ష వరకు ఉంటుందని సీఐ శివలింగం పేర్కొన్నారు. చైనా మాంజ స్టాక్ చేసి విక్రయిస్తున్న యజమానులు అజీమ్, అతని సోదరుడు పై కేసు నమోదు చేసారు. నిషేధిత చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని శివలింగం హేచ్చరించారు.
Also Read: Sankranti Exodus: అయ్యయ్యో.. వెలవెలబోయిన పర్యాటక ప్రాంతాలు.. ఇప్పుడు ఎలా..?

