Cyber Criminals (Image Source: AI)
తెలంగాణ

Cyber Criminals: దైవ భక్తులకు బిగ్ అలెర్ట్.. మీపై ఏ క్షణమైనా సైబర్ దాడి!

Cyber Criminals: రకరకాలుగా మోసాలు చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్​ తాజాగా ఆధ్యాత్మిక పర్యాటకంపై కన్నేశారు. దేశంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తులను టార్గెట్​ గా చేసుకుంటూ మోసాలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఈ తరహా నేరాలు జరుగుతుండటంతో కేంద్ర హోంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్​ అలర్ట్​ అయ్యింది. సైబర్ మోసగాళ్ల వలలో పడకండి అంటూ కొన్ని సూచనలు చేస్తూ ప్రకటన జారీ చేసింది.

33 రకాలుగా మోసాలు
ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకొని 33 రకాలుగా మోసాలు చేస్తున్న సైబర్​ కేటుగాళ్లు ఒక్క తెలంగాణ నుంచే ఏటా రూ.700 కోట్లు కొల్లగొడుతున్నట్లు అధికారులు తెలిపారు. కేదార్​ నాథ్​ యాత్రికులకు హెలికాప్టర్​ బుకింగులు, చార్​ ధామ్​ యాత్రికులకు గెస్ట్​ హౌసులు, హోటల్​ బుకింగ్ లు, క్యాబ్​ సర్వీసులు అందిస్తామంటూ ఫేక్​ వెబ్​ సైట్లు, ఫేస్ బుక్​ పోస్టులు పెట్టి మరీ మోసాలు చేస్తున్నారు. గూగుల్​ తదితర సెర్చ్​ ఇంజన్లలో ప్రకటనలు ఇస్తూ వందల మందిని బోల్తా కొట్టిస్తున్నారు. హాలీడే ప్యాకేజీల పేరిట టోకరా ఇస్తున్నారు. వీరి వలలో చిక్కి చెల్లింపులు చేస్తున్న వారికి ఆ తరువాత అందాల్సిన సేవలు అందటం లేదు.

అప్రమత్తమైన కేంద్రం
ఆయా వెబ్​ సైట్లు, పోస్టుల్లో ఇస్తున్న కాంటాక్ట్​ నెంబర్లకు ఫోన్లు చేస్తే స్పందన రావటం లేదు. అప్పుడుగానీ మోసపోయామని బాధితులకు తెలియటం లేదు. ఈ తరహా మోసాలు ఇటీవలిగా తరచూ వెలుగు చూస్తుండటంతో అప్రమత్తమైన కేంద్ర సైబర్​ కో ఆర్డినేషన్​ సెంటర్​ అప్రమత్తమైంది. స్పాన్సర్డ్​ పేరుతో ఫేస్​ బుక్​, వాట్సాప్​ ల ద్వారా వచ్చే లింకులను నమ్మవద్దని సూచించింది. నమ్మి క్లిక్​ చేసి డబ్బు కడితే మోసపోతారు జాగ్రత్త అని తెలిపింది. లింకులను క్లిక్​ చేసే ముందు అవి అసలైనవా? నకిలీవా? అని నిర్ధారించుకోవాలని పేర్కొంది.

Also Read: MLC Local body elections: హైదరాబాద్ లో ఎలక్షన్స్.. రెండే పోలింగ్ బూత్ లు.. అంతా టెన్షన్ టెన్షన్!

మోసాలకు అడ్డుకట్ట
ప్రభుత్వ అధికారిక వెబ్​ సైట్లు, నమ్మదగిని ప్రైవేట్​ ఏజన్సీల ద్వారానే కావాల్సిన సేవల కోసం చెల్లింపులు జరపాలని తెలియచేసింది. మోసానికి గురైతే వెంటనే cybercrime.gov.in అన్న పోర్టల్​ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించింది. దాంతోపాటు 1930 నెంబర్​ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలియచేసింది. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేయటానికి తాము కూడా గూగుల్​, ఫేస్​ బుక్​ తో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!