హైదరాబాద్, స్వేచ్ఛ:
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మాగంటి పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
