తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : MLA Raja Singh: తనవైపు కానీ తన ఫ్యామిలీ వైపు ఎవరైనా టెర్రరిస్టులు కన్నెత్తి చూస్తే ఆ టెర్రరిస్టులను అడ్డంగా నరుకుతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా రూట్ మ్యాప్ ను ఆయన సోమవారం కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఇటీవల తనకు ప్రాణహాని ఉందని పోలీసులు అలర్ట్ చేయడంపై ఆయన స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను, తన కుమారుడితో కలిసి బైక్ నడుపుతానని, పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తాము బైక్ పైనే తిరుగుతామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి శోభాయాత్రను నిర్వహిస్తున్నామని, ఏప్రిల్ 6న నిర్వహిస్తున్నామని తెలిపారు.
అందుకే రోడ్డు పరిశీలించామని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నట్లు చెప్పారు. కాగా వారికి రోడ్డు మ్యాప్ లో, ప్యాచ్ వర్క్, ట్రీ కట్టింగ్, లైట్ల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సూచించామన్నారు. ఇదిలా ఉండగా తమకు ప్రతీ ఏటా పోలీసుల వల్లే ఇబ్బంది ఉంటుందని, పోలీసులు కార్యకర్తలను, రామ భక్తులను కొడుతారని, ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని కోరారు.
Also Read: TTD Budget 2025: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుండి దర్శనం క్షణాల్లోనే..