BJP on Jaggareddy: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు టి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫ్లెక్సీని హనుమకొండ జిల్లా కమలాపూర్ లో బీజేపీ నాయకులు దగ్దం చేశారు. ఈటల రాజేందర్ పై తీవ్ర వాఖ్యలు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కమలాపూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జగ్గారెడ్డి ఫ్లెక్సీని చెప్పులు, చీపుర్లతో కొట్టి నిప్పంటించి నిరసన తెలిపారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ర్యాకం శ్రీనివాస్, వలిగే సాంబరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసన్నం కోసం జగ్గారెడ్డి ఇలా అనుచితంగా మాట్లాడటం దారుణమన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ పై జగ్గారెడ్డి రెడ్డి అహంకారంతో దుర్భాషలాడడం అమర్యాదకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటలకు బీజేపీ పెద్ద అవకాశాలిచ్చిందని నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా అవకాశం కల్పించిందని రెండు స్థానాల నుంచి పోటీ చేసే వెసులుబాటు కల్పించిందని గుర్తు చేశారు. జగ్గారెడ్డి తక్షణమే తన మాటలను ఉపసంహరించుకోవాలని లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపికి అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, నాయకులు పాల్గొన్నారు.
Also Read: Miss World 2025: దేశంలోనే సేఫేస్ట్ సిటీగా హైదరాబాద్..