BJP ( Image Source: Twitter)
తెలంగాణ

BJP: బీజేపీ మాస్టర్ ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా?

BJP: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 11 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్ని ఏండ్లలో వారు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు సైతం రంగంలోకి దిగి ప్రచారాన్ని ఉధృతంగా చేపడుతున్నారు. కాగా, ఈనెల 18 వరకు మరింత విస్తృతంగా చేపట్టి గ్రామ స్థాయికి తీసుకెళ్లనున్నారు. జీఎస్టీ మొదలు, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వరకు ఎదగడంపై ప్రతి విషయాన్ని పూస గుచ్చినట్లు వివరించేలా బుక్ లెట్లను సైతం సిద్ధం చేశారు. దేశ భద్రత, మేకిన్ ఇండియా, స్టార్టప్ కంపెనీలు, నూతన జాతీయ విద్యా విధానం, ‘హీరా’తో రవాణా కనెక్టివిటీ, ఆర్టికల్ 370, రామ మందిర నిర్మాణంపైనా విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక రచించుకున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారం చేపడుతున్నారు.

త్వరలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా.. 

2014లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో దేశం 10వ స్థానంలో నిలవగా తాజాగా 4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకుని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినట్లు చెబుతున్నారు. తొమ్మిదేండ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే విషయాన్ని వెల్లడించనున్నారు. 4 కోట్ల మంది పేదలకు పక్కా ఇండ్లను అందించిన చరిత్ర ఎన్డీయే ప్రభుత్వానిదిగా బీజేపీ చెప్పనుంది. సహకార సమాఖ్య విధానం ద్వారా అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతో జీఎస్టీని అమలు చేసినట్లు చెప్పనున్నారు. నల్లధనంపై యుద్ధంలో భాగంగా పెద్ద నోట్ల రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందనే అంశాన్ని నొక్కి చెప్పనున్నారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు పంటకు ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు అధిక ధర దక్కేలా కనీస మద్దతు ధరను పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదని బీజేపీ చెబుతున్నది.

దేశ భద్రతకు ప్రాధాన్యం

దేశ భద్రతకు మోదీ సర్కార్ అత్యధిక ప్రాధాన్యమివ్వడంతో శత్రుదేశాలతో పాటు, ప్రపంచ దేశాలకు రక్షణ రంగంలో దేశ సత్తాను చాటేలా ఎదిగామని, దానికి తాజా ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని బీజేపీ ప్రజలకు వివరించనుంది. 2016లో ఉరి ఘటనపై చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్, 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో ఎయిర్ స్ట్రైక్, తాజాగా పహల్ గావ్ ఘటనపై ఆపరేషన్ సింధూర్ ద్వారా పీవోకేలోని ఉగ్ర స్థావరాలను పేల్చి వాయుసేన శక్తిని ప్రపంచానికి చాటిచెప్పినట్లు ప్రజలకు వివరించనున్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాద హింస 53 శాతం తగ్గగా, భద్రతా బలగాలపై దాడులు 72శాతం, మరణాలు 70శాతం తగ్గినట్లు నేతలు చెప్పనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా ఉత్పత్తులు తయారు చేసి, ఎగుమతులు పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టపరిచామని వెల్లడించేలా బీజేపీ ప్లాన్ చేసుకుంది. స్టార్టప్‌లకు సహకారం అందించడం ద్వారా 2014లో 350 ఉన్న స్టార్టప్‌ల సంఖ్య 2024 నాటికి 1.5 లక్షలకు చేరినట్లుగా చెబుతున్నారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఐఐఎంల సంఖ్య 13 నుంచి 21కి పెరగ్గా, ఐఐటీలు 16 నుంచి 23కు పెరిగడం గమనార్హం.

మద్దతు కూడగట్టాలని బీజేపీ ప్రణాళిక

11 ఏండ్లో ‘భారత్ మాల ప్రాజెక్టు’ ద్వారా హీరా మోడల్‌ను అనుసరించి హైవేస్, ఇన్ఫోవేస్, రైల్వేస్, ఎయిర్ వేస్(హెచ్ఐఆర్ఏ) ద్వారా హైవే నెట్ వర్క్, స్మార్ట్ సిటీల అభివృద్ధి, రైలు కనెక్టివిటీని పెంచామని ప్రజలకు వివరించనున్నారు. జన్‌ధన్ యోజన ద్వారా ముద్ర రుణాల అందజేత, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, ట్రిపుల్ తలాఖ్ రద్దు, అయోధ్య రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, అంతరిక్ష విజయాలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు, పర్యాటకం, సాంస్కృతికాభివృద్ధి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచేలా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డును కేంద్రం అందించింది. ఇంకెందరికో పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను కూడా ఎన్డీయే ప్రభుత్వం అందించింది. ఈ అంశాలను విస్తృతంగా ప్రచారం చేపట్టి వారి మద్దతు కూడగట్టాలని బీజేపీ ప్రణాళిక రచించుకుంది. ఈనెల18 వరకు సాగే ఈ కార్యక్రమం పార్టీకి ఎంతమేరకు మైలేజ్ అందిస్తుందనేది చూడాలి.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్