BJP Sunil Bansal (imagecredit:twitter)
తెలంగాణ

BJP Sunil Bansal: వ్యక్తిగత స్టేట్ మెంట్లతో పార్టీకి నష్టం.. జాగ్రత్త బీకేర్ ఫుల్?

BJP Sunil Bansal: తెలంగాణ రాష్ట్రంలో వర్షాల కారణంగా వాతావారణం చల్లబడినా పొలిటికల్ హీట్ మరింత పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గడంలేదు. ఇటు కాళేశ్వరం కమిషన్ విచారణ, అటు కవిత లేఖాస్త్రాలతో పాలిటిక్స్ పీక్ స్టేజీకి చేరుకున్నాయి. కాగా ఈ రెండు అంశాలపై బీజేపీ సైతం ట్రబుల్ షూట్ కు దిగింది. ఈ అంశాలపై పలువురు ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తుండటంతో హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ఈనేపథ్యంలోనే కవిత లేఖ అంశంతో పాటు ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై నోరుజారొద్దని రాష్ట్ర నాయకత్వానికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసే కామెంట్స్ పార్టీకి తీరని నష్టం చేస్తున్నాయని హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగింది.

కవితను బీజేపి పార్టీలో చేర్చుకోము

ఇటీవల ఇరువురు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే ఈ అంశాలపై తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే అవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలే అయినా పార్టీ కార్యాలయంలో ఉండి చేసినవి కావడంతో పార్టీ ఎజెండాగానే పరిగణిస్తారని, ఇది పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అందుకే వ్యక్తిగత ఎజెండాను ఏమాత్రం బయటపెట్టొద్దని స్పష్టంచేసినట్లు సమాచారం. కవిత వచ్చినా పార్టీలోకి చేర్చుకోబోమని ఇటీవల ఒక ఎంపీ వ్యాఖ్యానించారు. కాగా మరో ఎంపీ కవిత కొత్త పార్టీ పెడుతోందని చెప్పుకొచ్చారు. అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడటం వల్లే నోటీసులు వచ్చాయని, కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే కాళేశ్వరం ఇష్యూలో ఎంపీ ఈటల రాజేందర్ కు సైతం నోటీసులు అందాయి. కాగా ఈ తరహా వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసినట్లవుతుందని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

Also Read: Jal Shakti Abhiyan: జలశక్తి అభియాన్‌లో దేశంలోనే.. తెలంగాణ 3వ స్థానం!

బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిసింది. కాగా పలువురు నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తంచేసినట్లు సమాచారం. సబ్జెక్టు లేకుండా మాట్లాడడం వల్ల పార్టీ పరువు పోతోందని, కవిత లేఖ, కాళేశ్వరం కమిషన్ ఇష్యూలో నోరు అదుపులో పెట్టుకోవాలని స్పష్టంచేసినట్లు తెలిసింది. అడ్డగోలుగా మాట్లాడుతూ.. పార్టీ లైన్ అతిక్రమిస్తే ఇకనుంచి ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సొంత ఏజెండాలు పక్కనపెట్టాలని, పార్టీ ఎజెండాను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని నేతలకు సూచనలు చేసినట్లు చర్చ జరుగుతోంది. టీ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా వారు తమ తీరు మార్చుకుంటారా? లేదా? అన్నది చూడాలి.

త్వరలో రాష్ట్రానికి సునీల్ బన్సల్ రాక

తెలంగాణకు త్వరలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రానున్నారు. భవిష్యత్ లో నిర్వహించే పలు కార్యక్రమాలపై వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు శ్రేణులు చెబుతున్నాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ 3.0 పేరిట ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. జూన్ 8 నుంచి 16వ తేదీ వరకు మోడీ 3.0 పేరిట ఏడాది పాలనపై కేంద్ర చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టనున్నారు. అలాగే జూన్ 5 నుంచి ఆగస్టు 15 వరకు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఆయా కార్యక్రమాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొనే వివిధ ప్రాంతాల్లో ఈ కర్యాక్రమాన్ని కొనసాగించనున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 26న పలు కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ ప్లాన్ చేసుకుంది. ఈ కార్యక్రమాల నిర్వహణ, సక్సెస్ చేయడంపై బన్సల్ వర్క్ షాప్ నిర్వహించే అవకాశముంది.

Also Read: Mahanadu 2025: టీడీపీలో కోవర్టులు.. స్వయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు

 

Just In

01

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు