BJP Jogulamba Gadwal: నేడు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డికె. బంగ్లాలో బిజెపి జిల్లా వివిధ మోర్చా ల సమావేశం లో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మోర్చాలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. జిల్లా లోని ప్రతి మండలంలో, అన్ని మోర్చాల కమిటీలు పూర్తి చేయలని అన్నారు.
మహిళా మోర్చా అధ్యక్షులు గ్రామంలోని ప్రతి కమిటీ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు భేటీ బచావో బేటి పడావో, ఉజ్వల యోజన గ్యాస్ కలెక్షన్, సుకన్య సమృద్ధి యోజన ప్రధానమంత్రి మాతృ వందన యోజన వంటి పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ప్రజలకు తెలియజేసి ,అవగాహన కల్పించాలని భారతీయ జనతా పార్టీలో బీజేవైఎం యువ మోర్చా పాత్ర ముఖ్యమని యువత ముందుకొచ్చి జిల్లాలో అభివృద్ధి గురించి ప్రశ్నించాలని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. కిసాన్ మోర్చా నాయకులు రైతుల ఆదాయం పెంచేందుకు ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభించారు. పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజసాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ,స్వచ్ఛ భారత్ అభియాన్ ఫసల్ బీమా యోజన, వంటి పథకాలు గ్రామీణ స్థాయిలో విస్తృతంగా తెలియాజేయలని అన్నారు.
ఓబీసీ మోర్చ నాయకులు గ్రామాల్లో విశ్వకర్మ యువజన పథకం, లేబర్ ఇన్సూరెన్స్ లు ప్రధానమంత్రి 20రూపాయలు , మరియు 420రూ” ప్రమాద బీమా ఇన్సూరెన్సులు , పీఎంఈజీపి వంటి పథకాలు ప్రజలకు వివరించాలని అన్నారు. బిజెపి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, సాధికారత కోసం అనేక పథకాలను ప్రారంభించింది. మైనారిటీ మోర్చా ఈ పథకాలను ప్రోత్సహించడానికి మైనారిటీలకు వాటి ప్రయోజనాలను అందించడానికిపనిచేస్తుంది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం విద్య ఉపాధి అవకాశాలు మైనారిటీ వర్గాల సంక్షేమం, సాధికారతపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు రవికుమార్ ఏక్బోటే, శ్యామ్ రావ్ ,జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేస్వర్ రెడ్డి, కిసాన్ మోర్చ అధ్యక్షుడు దరూర్ కిష్టాన్న, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్, మహిల్ మోర్చ అధ్యక్షురాలు సమత, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
