Bhatti Vikramarka: మహిళా పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
Bhatti Vikramarka (imagecredit:swetcha)
Telangana News

Bhatti Vikramarka: మహిళా పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: మహిళా పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్​యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) చెప్పారు. చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నియామకాలపుడు లేని లింగ వివక్ష విధుల్లో చూపటం సరైంది కాదన్నారు. మహిళా పోలీసులు(police) అని కాకుండా అందరిలా పోలీసులు అని పిలవాలన్న సిఫార్సు మంచి ఆలోచన అని చెప్పారు. తెలంగాణ పోలీస్(Telangana Police) అకాడమీలో మూడు రోజులపాటు జరిగిన మహిళా పోలీసుల సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు. మహిళా పోలీసుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేసి సైంటిఫిక్ గా ప్రభుత్వానికి అందిస్తే అమలు చేయటానికి ప్రభుత్వం సిద్ధమని చెప్పారు.

విద్యా విధానంలో కొత్త ఒరవడి

రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచగలమన్న మానవీయ కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలన చేస్తున్నారన్నారు. శాంతిభద్రతలు సురక్షితంగా ఉన్నపుడే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. పోలీసింగ్ లో రాష్​ట్ర పోలీసులు ప్రథమ స్థానంలో నిలబడటం అభినందనీయమన్నారు. అంకితభావంతో సిబ్బంది పని చేస్తుండటం వల్లనే ఇది సాధ్కమైందన్నారు. సిబ్బంది వ్యక్తిగత సమస్యలతోపాటు శాఖాపరమైన అవసరాలు, నూతన కార్యాలయాల భవనాలు, పోలీస్ స్టేషన్లు, క్వార్టర్స్ వంటి సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలను సూచించాలని అధికారులకు సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడికి ప్రభుత్వం కృత నిశ్చయమై ఉన్నట్టు చెప్పారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో ఒకేసారి 104 పాఠశాలలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. పోలీసుల పిల్లల కోసం ఇప్పటికే యంగ్​ ఇండియా పోలీస్ స్కూల్​ ను ప్రారంభించినట్టు చెప్పారు.

Also Read: Coolie A Certificate: సెన్సార్ బోర్డ్‌పై కేసు.. ‘కూలీ’ లాస్ నుంచి బయటపడేందుకు పెద్ద ప్లానే వేశారుగా!

మహిళా పోలీసుల సదస్సులో

హోం శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రవిగుప్తా మాట్లాడుతూ పోలీసు శాఖలోని ట్రాఫిక్(Traffic), శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్ ఇలా అన్ని విభాగాల్లో మహిళా సిబ్బంది రాణిస్తున్నారని చెప్పారు. డీజీపీ జితేందర్(DGP Jitender) మాట్లాడుతూ పోలీసింగ్ లో దేశంలోనే మనం నెంబర్ వన్ గా నిలిచామని చెప్పారు. మహిళా పోలీసుల సదస్సులో చర్చకు వచ్చిన సమస్యలు, వాటి పరిష్​కారానికి వచ్చిన సూచనలు అమలు చేయటానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామన్నారు. మహిళా సిబ్బంది పట్ల వివక్ష చూపిస్తే ఉపేక్షించేది లేదని స్పష్​ఠం చేశారు. సదస్సులో జరిగిన చర్చల వివరాలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్​ బిస్త్ వివరించారు. కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్​, జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యా మిశ్రా, అదనపు డీజీపీ స్వాతి లక్రా, తమిళనాడు రాష్ట్ర పోలీసు అధికారి బాల నాగదేవి, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్​ ఫారెస్ట్ సువర్ణతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Also Read: Spiny Gourd Benefits: బోడ కాకరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..