Min Bhatti Vikramarka: నాన్ టాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అండ్ కేపిటెల్ సబ్ కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Min Bhatti Vikramarka) ఆదేశించారు. సచివాలయంలో జరిగిన అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉప సంఘం భేటీలో మంత్రులు, కమిటీ సభ్యులైన ఉత్తం కుమార్ రెడ్డి(Uttam Kumar Reddyu), కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy)తో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమవేశం నిర్వహించారు. నాన్ టాక్స్ రెవెన్యూ(Non Tax Revenu) తో పాటుగా కేంద్ర నిధులను కూడా సాధించుకోవాలని చెప్పారు.
ఎక్సైజ్ ఆదాయాలు రాకుండా
గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా ఆపకుండా కొత్తగా 33,600 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వానికి ఔటర్ రింగ్ రోడ్(ORR), ఎక్సైజ్ ఆదాయాలు రాకుండా పోయాయని ఆయన చెప్పారు. రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి(Mahalaxmi), ఉచిత కరెంట్(Free Curent), ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కొత్త పథకాలను ప్రజలకు ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. బడ్జెట్ నిధులు కొన్ని శాఖలు అధికంగా, మరికొన్ని శాఖలకు అతి తక్కువగా అందుతున్నాయన్నారు.
Also Read: USA Advisory: ఉత్తర తెలంగాణ వెళ్లొద్దు… అమెరికా సంచలన అడ్వైజరీ
మేజర్ ప్రాజెక్టులను ప్రాధాన్యత
బడ్జెట్(Budjet) ని అన్ని శాఖల, డిపార్ట్మెంట్లకు సమానంగా పంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. డిపార్ట్మెంట్ల మధ్య ఖర్చు అంతరాలను తగ్గించి అన్నింటిని ఒకే స్థాయిలోకి తీసుకురావాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులను అన్ని శాఖలు, డిపార్ట్మెంట్లకు సమానంగా పంచాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పెండింగ్ లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా అనుసరించి వెంటనే పూర్తి చేయాల ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అవసరాలు, ఆసక్తి, సంక్షేమం, ప్రభుత్వ ఆలోచనలన్నీ సమ్మిళితం చేసి ముందుకు సాగాల్సినఅవసరం ఉన్నదన్నారు.
అన్ని డిపార్ట్ మెంట్లలోని ఖర్చును రేషనలైజేషన్ చేస్తూ పది రోజుల్లో స్పష్టమైన ప్రణాళికలు ఇవ్వాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(Ramakrishan Rao), ఆర్థిక శాఖ ప్రిన్పినల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా(Sandeep Kumar Sulthaneeya) అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: YS Jagan: జగన్.. రప్పా రప్పా అంటే ఇదేనా?