TG-Assembly
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Assembly Restrictions: సోమవారం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు.. ఎందుకంటే?

Assembly Restrictions: అనర్హత పిటిషన్లపై విచారణ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం

ఈ నెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు
మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా నో పర్మిషన్
మీడియా పాయింట్ వద్ దసమావేశాలకు కూడా వర్తింపు
బులిటెన్ విడుదల చేసిన అసెంబ్లీ సెక్రటరీ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో (Assembly Restrictions) ఆంక్షలు విధిస్తూ శాసనసభ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు ఆదివారం బులెటిన్ విడుదల చేశారు.

Read Also- Ind Vs Pak Final: భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు అభిషేక్ శర్మ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అనర్హత పిటిషన్లను విచారణ చేపడుతుండటంతో ఆంక్షలు విధించారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆ బులెటిన్‌లో వివరించారు. శాసనసభ ప్రాంగణంలోకి సందర్శకులను అనుమతించబోమని చెప్పారు. మీడియా సిబ్బందిని సైతం శాసనసభ భవనాల ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని వివరించారు. మీడియా పాయింట్ల వద్ద, శాసనసభ భవనాల ప్రాంగణంలో కూడా ప్రెస్ బ్రీఫింగ్‌లకు కూడా అనుమతి ఉండదని చెప్పారు.

Read Also- Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు

మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సైతం శాసనసభ భవనాల ప్రాంగణంలోకి అనుమతి లేదని వెల్లడించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వారి వారి శాసనసభ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 10వ షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే సభ్యులు (పిటిషనర్లు, ప్రతివాదులు), వారి న్యాయవాదులు కోర్టు హాల్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవద్దని సూచించారు. కార్యకలాపాలను రికార్డ్ చేయడంలో, వారి ఫోన్‌లతో ఫొటోలు, వీడియోలు తీసినట్లు తేలితే జప్తు చేస్తామని హెచ్చరించారు.

Just In

01

Telangana Education: విద్యార్థులకు ల్యాబ్ మ్యాన్యుయల్స్.. ప్రతి క్లాసుకు 2 కాపీల చొప్పున పంపిణీ

Deepa Mehta: బాలీవుడ్ స్టార్ యాక్టర్ మొదటి భార్య దీపా మెహతా కన్నుమూత

Telangana Intermediate Board: ఇక పై ఇంటర్ లో ఏఐ కోర్సు..

Ind Vs Pak Final: అదరగొట్టిన బౌలర్లు.. పాకిస్థాన్ ఆలౌట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్!

Jr NTR: అమ్మమ్మ చెప్పిన కథలు.. తెరపై చూశాక మాటలు రాలేదు