Amit Shah: మావోయిస్టులు లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు
Amit Shah (imagecrdit:twitter)
Telangana News

Amit Shah: మావోయిస్టులు లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు: అమిత్ షా

Amit Shah: మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) జగదల్పూర్ లో సందర్శించారు. అనంతరం అమిత్ షా విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టులను మార్చి 2026 ముందు లొంగిపోవాలని సూచించారు. భాస్కర్ ఇప్పుడు అభివృద్ధి మార్గంలో నడుస్తుందని ఆయన వివరించారు. భాస్కర్ జిల్లాలో చాలా మార్గాలు నక్సల్స్ రహితంగా చేయడానికి పటిష్ట ప్రణాళిక రచించామని ఆయన అన్నారు. తర్వాత హోం మంత్రి అమిత్ షా మురియా దర్బార్ లోని భాస్కర్ దసీర ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పరిపాలన సుపరిచితంగా సాగేలా..

అక్కడ హోం మంత్రి భాస్కర్ దశర కమిటీ, గ్రామ పెద్దల అధిపతులను సాంప్రదాయం ప్రకారం కలుసుకున్నారు. వారి గ్రామాల సమస్యలను తెలుసుకుని అక్కడ అన్ని రకాల సౌకర్యాలను కల్పించి స్వేచ్ఛాయుతమైన పాలనకు శ్రీకారం చుడతామని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న పోలీసు అధికారులకు బషీర(Basheera) ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరించాలని, పరిపాలన సుపరిచితంగా సాగేలా కృషి చేయాలని ఆదేశించారు.

Also Read: Kantara 1 collection: రెండో రోజు కూడా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్లు.. ఎంతంటే?

2031 నాటికి..

2031 నాటికి బస్టర్ లోని ప్రతి గ్రామంలో విద్యుత్(Power), నీటి వ్యవస్థ తోపాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ గ్రామాలను అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి ఇక్కడ ఉన్న గ్రామాల లోని ఆదివాసి ప్రాంత వాసులకు విద్య, వైద్యం అందించేలా ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నామన్నారు. దషీరా లో ప్రధాన మచి డ్రైవర్లకు అమిత్ షా(Amit Shah) హామీ ఇచ్చారు. ఇదే గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఛత్తీస్గఢ్(Chhattisgarh) ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులను సమకూరుస్తామని వివరించారు. 2031 వరకు భాస్కర్ విభాగంలో చిన్న పల్లెటూరు అనేది లేకుండా చేసి ప్రతి గ్రామానికి రహదారులు, విద్యుత్ ను అందించేందుకు అహర్నిశలు ఛత్తీస్గడ్(Chhattisgarh) ప్రభుత్వం కృషిచేసేలా చూస్తామన్నారు.

Also Read: Sasivadane: ఇందులో ఎటువంటి అశ్లీలత ఉండదు.. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు చూసుండరు

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!