Kamareddy( Image Source : Twitter)
తెలంగాణ

Kamareddy: కల్తీ కల్లు తాగి వింత చేష్టలు.. తక్షణం 58 మంది వైద్యశాలకు తరలింపు..

Kamareddy: మధ్య అన్ని కల్తీ అయిపోయాయి. మనం తాగే నీరు నుంచి తినే ఫుడ్ వరకు ప్రతిదీ కల్తీ గా మారింది. తాజాగా, కల్తీ కామారెడ్డిలో కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురయ్యారు. బిర్కూర్ మండలంలోని దామరంచ, నసుర్లబాద్ మండలంలోని అంకోల్, దుర్కి, సంగ్యం గ్రామాలలో కల్తీ కల్లు కలకలం రేగింది. వారిలో 15 మంది తీవ్ర అస్వస్థత గురయ్యారు.

Also Read:  Hyderabad Local Body Elections: జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్.. అందరి చూపు అటువైపే..

గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో, ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించి దీనిపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read:  Telangana RTC: ఆర్టీసీలో ఏడడుగుల బుల్లెట్.. అతడిపై సీఎం రేవంత్ ఫోకస్.. మంత్రి కీలక ఆదేశాలు!

ఘటనలో ఇంత మంది ఒకేసారి అనారోగ్యానికి గురి కావడంతో కల్లు దుకాణాల లైసెన్స్‌లు వెంటనే రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ధికారులను ఆదేశించారు. సమ్మర్ లో చలువ కోసం ప్రజల కల్లు తాగుదామని వెళ్తే, ఇదే ప్రాణాలకు ముప్పుగా మారడంతో ఇలాంటి వాటిని వెంటనే మూసివేయాలని అక్కడున్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు తాగి ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోవాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. వీటిని పూర్తిగా క్లోజ్ చేసి, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వద్దని స్థానికులు కోరుతున్నారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు