Pushpa 2 Anasuya As Dakshayani First Look Released On The Occasion Of Her Birthday: జబర్ధస్త్ యాంకర్‌గా, మూవీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనసూయ భరద్వాజ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అనసూయకు ఒక్క టాలీవుడ్‌లోనే కాదు, తమిళం, కన్నడలోనూ ఆఫర్స్ అందుకుంటూ మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా నడుస్తోంది. ఇక కొన్ని చిత్రాల్లో కీ రోల్స్ చేస్తూ తగ్గేదేలే అంటోంది. ఇక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 ది రూల్’ లో యాక్ట్ చేస్తూ బిజీబిజీగా ఉంది.
ఇందులో అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి పార్ట్‌లో దాక్షాయణిగా నటించింది. ఇప్పుడు ఆ పాత్రకు కొనసాగింపుగా ఉండే రోల్‌లో సందడి చేయనుంది.తాజాగా ఆమె బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ ఓ స్టిల్‌ను రిలీజ్ చేసింది. ఎర్రచందనం కలప ఉండే చోట ఓ టేబుల్‌పై ఆమె కూర్చుని పక్కనే మందు బాటిల్‌తో దాక్షాయణిగా చమత్కారమైన యాసతో నోట్లో గుట్కా నములుతూ మందు తాగుతున్నట్లుగా ఆమె అనిపిస్తుంది.
Also Read: దేవకన్య లుక్‌లో షాకిచ్చిన చిన్నారి పెళ్లికూతురు
వెనుక ఆమె రౌడీలు ఉండగా ఎవరితో సీరియస్‌గా చూస్తున్న ఈ స్టిల్ నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్ హైదరాబాద్ నగర పరిసరాల్లో జరుగుతుంది. కాగా ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, అనసూయ వంటి వాళ్లు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు మూవీ యూనిట్.