Parliament 5 shedules completed..bjp: ఐదు దశలు..తగ్గిన ఆశలు
5 shedules elections completed
Top Stories, జాతీయం

India:ఐదు దశలు..తగ్గిన ఆశలు

  • విజయవంతంగా పూర్తయిన 5 దశల ఎన్నికలు
  • ఒక్కో దశ ఎన్నికలలో ఒక్కో విధంగా బీజేపీ ప్రచారం
  • ప్రతి దశలోనూ బీజేపీ నేతలు కోల్పోతున్న సహనం
  • దూరమవుతున్న పార్టీలు పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు
  • విద్వేషపు ప్రసంగాలతో ముస్లిం ఓటర్లకు దూరం అవుతున్న బీజేపీ
  • మిగిలిన రెండు దశల ప్రక్రియలోనూ బీజేపీకి ఎదురీతే..
  • మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలనుకుంటున్న బీజేపీ అంటున్న రాజకీయ విశ్లేషకులు

Parliament election 5 shedules completed..bjp faceing troubles:
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఐదు దశల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక మిగిలింది రెండు దశలే. అయితే సోమవారం జరిగిన ఐదవ దశ ఎన్నిక చాలా చిన్నది. ఎందుకంటే 49 నియోజకవర్గాల ఓటర్ల తీర్పు ఇది. అందరూ తేలిగ్గా కొట్టిపారేయవచ్చు. కానీ ఈ ఐదవ దశ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో తీవ్ర ప్రభావం చూపేది కావడం విశేషం. అయితే 2014, 2019 ఎన్నికలలో చాలా ఈజీగా బీజేపీ గెలిచింి. కానీ ఈ సారి చాలా చోట్ల ఎదురీదవలసిన అగత్యం ఏర్పడింది. 49 నియోజకవర్గాలలో యూపీలోనిన రాయ్ బరేలీ, అమేథి, ఫైజాబాద్ (అయోధ్య), బిహార్ లోని సరణ్, హాజీపూర్, ముంబై మహానగరంలోని మొత్తం ఆరు నియోజకవర్గాలు వర్తమాన రాజకీయాలపై తీవ్రప్రభావం చూపే నియోజక వర్గాలే. గతంలో బీజేపీ సాధించుకున్న వాటిలో చాలా సీట్లు కోల్పోనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఈ 49 నుంచి 39 స్థానాలను ఎన్డీఏ కూటమి సాధించుకుంది. అయితే అప్పటి ఇండియా కూటమి కేవలం 8 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అయితే ఈ ఎన్నికలలో ఆ సంఖ్య దాదాపు రెట్టింపు కానుందని ప్రతిపక్షాలు ఆశాజనకంగా ఉన్నాయి.

క్రమంగా బలపడుతున్న ప్రాంతీయ పార్టీలు

గత ఎన్నికల సరళి చూస్తే ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీల బలం కోల్పోయినట్లే కనిపించింది. అయితే అసెంబ్లీ స్థాయిలో బీజేపీకి కొద్దో గొప్పో పోటీని ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో మోదీ హవాను నిలువరించలేకపోయాయి. అయితే మోదీ పాలనలో ఈ పదేళ్లలో యూపీలో ఎస్పీ, బీహార్‌లో ఆర్జేడీ, జార్ఖండ్‌లో జేఎంఎం, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌లు బాగా పుంజుకున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉండటం, బీజేపీని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా సాగుతుండటం కలిసి వచ్చే అంశం అంటున్నారు. నిన్న మొన్నటిదాకా ఇండియా కూటమి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ కు దూరం అవుతూ వచ్చాయి. తీరా ఎన్నికల సమయంలో మళ్లీ అంతా కాంగ్రెస్ ను దగ్గరకు తీసుకోవడం గమనిస్తే కాంగ్రెస్ కు కలిసొచ్చేలానే ఉంది. ఒంటరిగానే బరిలో దిగుతానన్న పశ్చిమ బెంగాల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమకి బయటనుంచి మద్దతు ఇస్తానని ప్రకటించడంతో కాంగ్రెస్ బలం పెరిగినట్లయింది. మొన్నటిదాకా ఇండియా కూటమిది ఒక లెక్క..ఎన్నికల సమయంలో మరో లెక్క అన్నట్లుగా ఉంది. ఇప్పుడు ఇండియా కూటమి ఇచ్చే షాక్ తో ఎన్డీఏ కుదేలయిందని చెప్పవచ్చు. అందుకే ప్రతి విడతలో మోదీ తన స్వరం మారుస్తున్నారు. రిజర్వేషన్లు రద్దుపై మాట మార్చారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదంటూ కవరింగ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తునే ఉన్నారు. అలాగే మొన్నటిదాకా రాజ్యాంగాన్నే మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ సర్కార్ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చబోమంటూ ఖండనలు, వివరణలు ఇస్తున్నారు. చివరికి మత ప్రాతిపదిక రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం అంటున్న మోదీ కొంత స్వరం మార్చి తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, తనకు ఎంతో మంది ముస్లిం స్నేహితులున్నారని, చిన్నప్పడు తమ ఇంట్లో ఈద్‌ పండుగను నిర్వహించే వాళ్లమని, సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ బలంగా నమ్ముతానని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదంతా యూపీ, బీహార్‌, మహారాష్ట్ర, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం ఉంటుందని, దీనివల్ల బీజేపీకి నష్టం జరుగుతుందనే గ్రహించే మోదీ స్వరం మార్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

కనిపించని గత ఎన్నికల ధీమా

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 5వ విడత ఎన్నికలలో 17 స్థానాలలో పోటీచేసింది. లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ, కాంగ్రెస్ సీట్ల సర్ధుబాటు చేసుకుని కలసికట్టుగా ముందుకు వెళ్లాయి. రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు స్వమన్వయంతో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. గత ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 62 చోట్ల గెలిచిన బీజేపీకి ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి సవాల్‌ విసురుతోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ కూడా ఢిల్లీ, యూపీలలో ప్రచారం చేశారు. ఇది మోదీకి మింగుడు పడని అంశం. అందుకే ఆయన మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని, ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని అమిత్‌ షా సహా ఆపార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. ఈడీ కూడా కేజ్రీవాల్‌ బెయిల్‌ను రద్దు చేయాలన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీన్నిబట్టి ఇండియా కూటమి పట్ల ఎంత కలవరానికి గురవుతున్నారో తెలుస్తోంది. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని జూన్‌ 4 తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలు అవుతుందని, యువరాజులు (అఖిలేవ్‌, రాహుల్‌లను ఉద్దేశించి) వేసవి విడిది పేరుతో విదేశాలకు వెళ్లిపోతారని ఎద్దేవా చేస్తున్నారు. ఆరు, ఏడు దశల్లో . ఇక్కడ గతంలో గెలుచుకున్న స్థానాలను నిలబెట్టుకోవడం కోసమే కమలనాథులు తీవ్రంగా కష్టపడుతున్నారు.

కూటమి కలిసినా మెజారిటీ కష్టమే

బీజేపీ 2019లో సొంతంగా గెలుచుకున్న 303 స్థానాలు సైతం గణనీయంగా తగ్గుతాయని, మెజారిటీ మార్కును చేరుకోలేదని , ఎన్టీఏ కూటమిని కలుపుకున్నా కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి మే 25న 57 స్థానాలలో, జూన్ 1న జరిగే 57 స్థానాలలో ఎక్కువ స్థానాలు బీజేపీ దక్కించుకుంటుందా లేదా అన్నది ప్రుశ్నార్థకమే. అందుకే చివరి దశ ఎన్నికలక వచ్చేసరికి మోదీ అండ్ కో ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేసుకుని వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నాయి. అంతేకాదు ఓటర్లను కూడా భయపెడుతున్నారు. ఇండియా కూటమి వస్తే అయోధ్యను బుల్ డోజర్లతో కూల్చేస్తారని భయపెట్టే వ్యాఖ్యలు చేస్తూ రోజుకో గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. మరి వారి ఫీట్లు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియాలంటే జూన్ 4 దాకా వేచిచూడాల్సిందే.

Just In

01

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం

Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్