Neet sam victim Sanjeev Mukhiya
Top Stories, జాతీయం

National:‘నీట్’ డొంక కదిలింది

  • నీట్ వ్యవహారంలో బయటకొస్తున్న కీలక నిందితులు
  • ఇప్పటికే 14 మందిని అదుపులోకి తీసుకున్న బీహార్ పోలీసులు
  • తప్పించుకుని తిరుగుతుతున్న కీలక సూత్రధారి సంజీవ్ ముఖియా
  • గతంలోనూ పేపర్ల లీకేజీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన సంజీవ్ ముఖియా
  • పేపర్ లీకేజీ కేసులో శిక్ష అనుభవిస్తున్న సంజీవ్ కొడుకు
  • ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌ పేరుతో తండ్రీ కొడుకుల అరాచకాలు
  • సంజీవ్ ముఖియా వెనక రాజకీయ శక్తులు ఏమైనా ఉన్నాయా?
  • సంజీవ్ పట్టుబడితే మరిన్ని విషయాలు వెలుగులోకి

NEET exam scam back main victim Sanjeev Mukhiya and his Gang key role:

దేశవ్యాప్తంగా నిర్వహించిన వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘నీట్’ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కీలక ములపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఇప్పటివరకూ మీడియేటర్లు, విద్యార్థులు సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీళ్లంతా చిన్న చేపలు మాత్రమే అసలు తిమింగలం పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ అవకవకలకు ఆద్యుడు గా అతని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అతడే సంజీవ్ ముఖియీ. నీట్ లీకీజీ బాగోతం వెనక సూత్రధారి అతడే అనే అనమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరీ సంజీవ్ ముఖియా? ఏ ప్రాంతం వాడు?అప్పుడే అతని గురించి జనం ఆరాలు తీస్తున్నారు.

కీలక కుట్రదారుడు

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే ఇప్పటివరకూ నీట్ లీకేజ్ వ్యవహారంపై అధికారికంగా సంజీవ్ ముఖియా పేరు బయటకు రాకపోయినా అతడే కీలక కుట్రదారుడని పోలీసు వర్గాలు చెబుతున్న మాట. ఎందుకంటే నీట్ ప్రశ్నపత్రం మొదట అందుకున్న వ్యక్తి సంజీవ్ ముఖియా అని తెలుస్తోంది. సంజీవ్ ఓ ప్రొఫెసర్ సాయంతో పేపర్ ముందుగానే తన వద్దకు తెప్పించుకుని తొలుత రాకీ అనే వ్యక్తికి అందజేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పాట్నాలోని ఓ బాయ్స్ హాస్టల్ కు చెందిన బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నాడు సంజీవ్. అక్కడే 25 మంది విద్యార్థులకు షెల్టర్ కల్పించాడు. వారందరి వద్ద ముందుగానే డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు. ఇక వాళ్లందరికీ లీకైన పేపరు అందజేసి ముందుగానే ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయించినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా పేపర్ లీక్ వ్యహారం బాహాటం కావడంతో అప్పటినుంచి సంజీవ్ అజ్షాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం బీహార్ పోలీసులు సంజీవ్ ముఖియా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంజీవ్‌ ముఖియా ఎక్కడివాడు?

బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లా నాగర్ సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియా సాబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసేవాడు. 2016లో అక్కడ కూడా సంజీవ్ పై పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి. వెంటనే అధికారులు అతడిపై సస్నెన్షన్ వేటు వేశారు. దానికి సంబంధించిన కేసులో కొన్నాళ్లు జైలు ఊచలు కూడా లెక్కపెట్టాడు ఈ సంజీవ్ ముఖయా అనంతరం నలందా కాలేజీ నూర్‌సరయ్‌ బ్రాంచ్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరాడు. గతంలోనూ పలు ప్రభుత్వ పరీక్షల పేపర్‌ లీక్‌ కేసుల్లో ఇతడి పేరు బయటకురావడం గమనార్హం.

తండ్రీకొడుకులు ఇద్దరూ లీకు వీరులే

2010లో పరీక్ష పేపర్ లీకేజీ వార్తల సమయంలో సంజీవ్ ముఖియా పేరు మారు మ్రోగింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌ఈ) సహా అనేక పరీక్షల పేపర్ లీక్‌లకు సూత్రధారి. ఆ తర్వాత పేపర్‌ లీకేజీల కోసం ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సంజీవ్ కుమారుడు శివ్ కుమార్ గతంలో బీపీఎస్‌ఈ పరీక్ష లీక్ వ్యవహారంలో అరెస్టయ్యాడు. ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వృత్తిరీత్యా వైద్యుడైన శివ్‌.. బిహార్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తండ్రీకొడుకులిద్దరూ ‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నారు.. వాస్తవానికి అతడి అసలు పేరు సంజీవ్‌ సింగ్‌. భార్య మమతా దేవీ భుఠాకర్‌ గ్రామ పంచాయతీ ముఖియాగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి స్థానికులు ఇతడిని కూడా ముఖియాగా పిలుస్తున్నారు. సంజీవ్‌ భార్య 2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌ జనశక్తి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

మలుపు తిప్పిన ఫోన్ కాల్

మే 5వ తేదీ దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది. కాగా అదే రోజున బీహార్ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దానితోనే పేపర్ లీక్ వ్యవహారం బయటపడిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రాన్ని ఓ గ్యాంగ్ లీక్ చేసిందని ఝార్ఖండ్ కు చెందిన సెంట్రల్ ఏజెన్సీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వారు నిందితులు ఉపయోగించిన కారు డిటైల్స్ కూడా అందించారు. దాంతో ఆ కారును ట్రాక్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని నిర్భంధించి సమాచారం రాబట్టారు పోలీసులు. పేపర్ లీక్ చేసినందుకు నిందితులు ఒక్కో క్యాండిడేట్ నుంచి రూ.30 నుంచి 50 లక్షల దాకా వసూలు చేశారు. ఈ ముఠాలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నాడు.

పోలీసులకు చిక్కిన ఫిక్సర్‌ రవి..

ఇప్పటికే పేపర్ లీక్ లో కీలక సూత్రధారి గా వ్యవహరించిన మరో నిందితుడు రవి అత్రిని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి సంజీవ్ ముఖియాకు అత్యంత సన్నిహితుడు. నోయిడా ప్రాంతానికి చెందిన రవి పేపర్ లీక్ వ్యవహారంలో మీడియేటర్ గా వ్యవహరించారు.
రవి గతంలోనూ పేపర్‌ లీకేజీ కేసులో అరెస్టయ్యాడు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని కోటాలో ఇతడు కోచింగ్‌ తీసుకున్నాడు. 2012లో పరీక్ష పాసై రోహ్‌తక్‌ కాలేజీలో సీటు సంపాదించాడు. అయితే నాలుగో సంవత్సరం పరీక్షలు రాయకుండా వచ్చేశాడు. అప్పటి నుంచి ‘ఎగ్జామ్‌ మాఫియా’ గ్యాంగ్‌తో సంబంధాలు జరిపాడు. విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను పంపించి పరీక్ష రాయించడం వంటి నేరాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. కీలక సూత్ర ధారి సంజీవ్ ముఖియా అని తేలింది. ఇక అతడు పట్టుబడితే అతని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరు? పాత్రధారులెవరో బయటకు వచ్చు ఛాన్స్ ఉంది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!