Exit polls survey
Top Stories, జాతీయం

National:పల్స్ కు అందని ‘పోల్స్’

  • ఎన్టీయేకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు
  • సంబురాలు చేసుకుంటున్న బీజేపీ శ్రేణులు
  • 2004లో వాజ్ పేయి విజయంపైనా అంతే ధీమా
  • నాడు ఎగ్జిట్‌పోల్‌ సర్వేలన్నీ బీజేపీకి అనుకూలం
  • తల్లక్రిందులైన 2004 ఎగ్జిట్ పోల్స్ సర్వేలు
  • 2004లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌
  • 2009లోనూ బీజేపీకి అనుకూలంగా సర్వేలు
  • 2009లో తిరిగి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్

Exit polls revers survey information in 2004 2009 against congress success:
ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చూసి బీజేపీ శ్రేణులు జోష్ గా సంబురాలు చేసుకుంటున్నారు. గత చరిత్రను మాత్రం మర్చిపోతున్నారు. 2004 ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ లో నాడు వాజ్ పేయి సారధ్యంలో బీజేపీ విజయం సాధించబోతోందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ భారీ అంచాలతో కూడిన సర్వేలు అందించాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలక్రిందులు అయ్యాయి. ఊహించని రీతిలో కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ చూసుకుని ఎన్డీఏ కూటమి అంతగా ఎగ్జయిట్ అవ్వవలసిన పనిలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. అలాగే ఇండియా కూటమి కూడా అధైర్య పడనవసరం లేదని ఒక్కసారి ఇరవై ఏళ్లు వెనక్కి వెళితే రివర్స్ గేర్ అయిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెలుస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 2004 ఎగ్జిట్ పోల్స్ సరళిని గమనిస్తే నాటి ఎన్డీఏ కూటమికి 230 నుంచి 250 సీట్లు వస్తాయని ఎన్డీటీవీ-ఏసీ-నీల్సన్ సంస్థ అంచనా వేసింది. అలాగే నాటి యూపీఏ కూటమికి సంబంధించి 190 205 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ఇతరులు 100 నుంచి 120 సీట్మలు గెలుస్తారని జోస్యం చెప్పింది.

తార్ మార్ టక్కర్ మార్

2004లో సహారా-డీఆర్ఎస్ సంస్థ ఎన్టీయే కూటమికి 263 నుంచి 278 వస్తాయని ప్రకటించింది. కాంగ్రెస్ కూటమికి మాత్రం 171 నుంచి 181 దాకా వస్తాయని చెప్పింది. ఇతరులకు 92 నుంచి 102 వరకూ సీట్లు వస్తాయని అంచనాలు వేసింది. ఆజ్ తక్-మార్గ్ సైతం ఇదే తరహాలు ఎన్టీయే కూటమికి 248 కాంగ్రెస్ కూటమికి 190, ఇతరులకు 105 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక స్టార్ న్యూస్-సీఓటర్ సంస్థ ఎన్టీయేకు 263 నుంచి 275 మధ్య సీట్లు వస్తాయని, తమ సర్వేలో తేలిందని తెలిపాయి. అలాగే అవుట్ లుక్-ఎండీఆర్ఏ సైతం ఎన్టీయేకు 280, కాంగ్రెస్ కూటమికి 159 టూ 169, ఇతరులకు 89 టూ 99 సీట్లు రావచ్చని అంచనాలు వేశాయి. తీరా ఎన్నికల అసలైన ఫలితాలు చూసి అంతా అవాక్కయ్యారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించే సమయానికి ఎన్టీఏ కూటమి 189 స్థానాలకే పరిమితం అయింది. కాంగ్రెస్ కూటమి 222 సీట్లు గెలుచుకుంది. ఇతరులు 132 సీట్లలో గెలుపొందారు. 2009 లో ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగు ఎగ్జిట్ పోల్స్ యూపీఏ విజయాన్ని తక్కువ అంచనా వేశాయి. నాటి యూపీఏకు 195, ఎన్టీయేకు 185 సీట్లు వస్తాయని దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనాలు వేశాయి. అయితే అప్పుడు యూపీఏ 262 సీట్లు, ఎన్టీయే 158 సీట్లు గెలుచుకుంది. యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ 206 సీట్లు, ఎన్టీయే కూటమిలోని బీజేపీ 116 సీట్లు 2009 సంవత్సరంలో సీట్లు గెలుచుకున్నాయి.

ఆ పది శాతం ఓట్లే ప్రభావం చూపేది

2024 ఎన్నికల్లో బీజేపీ ఊదరగొడుతున్నట్టు నాలుగు వందల సీట్లు దాటే అవకాశం లేదని తేలిపోయింది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ 240 సీట్లకే పరిమితం చేశాయి. అయితే బీజేపీ పుంజుకునే అవకాశాలు లేవని స్పష్టం అవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి పుంజుకునే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలకు మాత్రమేనని చెబుతున్నారు. బీజేపీ ఇక తగ్గుదల ప్రభావంలో ఉన్నదని, ఇంతకు మించి పెరిగే అవకాశం ఇప్పటికైతే లేదని విశ్లేషిస్తున్నారు. అందుకు గతంలో రాజకీయ పార్టీలు సాధించిన ఓటింగ్‌ శాతాలను ప్రస్తావిస్తున్నారు. 1984లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 49.10 శాతం ఓట్లతో 404 స్థానాలు గెలుచుకుంది. అయితే 1989 ఎన్నికల నాటికి 197 స్థానాలకు పడిపోయింది. కేవలం 9.57 శాతం ఓట్ల తేడాతో ఆ పార్టీ 197 స్థానాలు కోల్పోయింది. 2009 ఎన్నికలకు వచ్చేసరికి ఇదే కాంగ్రెస్ పార్టీ 28.55 శాతం ఓట్లతో 206 సీట్లు గెలుచుకుంది. 2014లో 19.52 శాతం ఓట్లతో 44 సీట్లుకు పరిమితం అయింది. ఈ లెక్కలు చూస్తే కేవలం 9.03 శాతం ఓట్ల తేడాతో ఏకంగా 162 సీట్లను కాంగ్రెస్ కోల్పోవడం జరిగింది. ఇలా చిన్నపాటి ఓటింగ్ శాతంలో వచ్చే తేడాలే రాజకీయ పార్టీల భవితను తేలుస్తున్నాయి. వాటిని భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తున్నాయి ఈ కొద్దిపాటి ఓటింగ్ శాతాలే.

కాంగ్రెస్ 5 శాతం ఓటింగ్ పెంచుకుంటే అధికారమే

దాదాపు వందకు పైగా సీట్ల ఫలితాన్ని తొమ్మిది శాతం లేదా పది శాతం ఓట్లు నిర్దేశిస్తాయని! కాంగ్రెస్‌ ఈ వాస్తవాన్ని ఆధారంగా చేసుకునే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో తాము కనీసం ఓ ఐదు శాతం ఓట్లను పెంచుకోగలమనే విశ్వాసాన్ని కాంగ్రెస్‌ వ్యూహకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి తాము పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యాంటిఇంకంబెన్సీ ప్రభావం అనేది ఇప్పుడు ఉండదని వారు ప్రస్తావిస్తున్నారు. అందులోనూ ఈసారి గతంలో ఉన్నట్టు పుల్వామా, బాలాకోట్‌ వంటి భావోద్వేగ అంశాలు కూడా ఏమీ లేవని వారు చెబుతున్నారు. నరేంద్రమోదీ తొలి రోజుల్లో అయోధ్య రామాలయం అంశాన్ని బాగా ప్రస్తావించినా.. అది పెద్దగా ఓట్లు రాల్చే అవకాశం లేదని తేలిపోవడంతోనే వ్యూహం మార్చి, హిందూ, ముస్లిం అంశాలపై కేంద్రీకరించారని విశ్లేషకులు సైతం అంటున్నారు. అయితే.. జాతీయవాదం, ఉగ్రవాదం, హిందూ, ముస్లిం అంశాలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ గత పదేళ్లలో ప్రతి ఎన్నికల్లోనూ అవే అంశాలను ప్రస్తావిస్తుండటాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని, అవి వినీ వినీ విసుగెత్తిపోయి ఉన్నారని అంటున్నారు. ప్రజలకు తమ ప్రాథమిక అవసరాలైన కూడు, గుడ్డ, నీడ కీలకం అవుతాయి కానీ.. భావోద్వేగా అంశాలు వాటిపై పనిచేయవని స్పష్టం చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!