Costly Indian Elections
Top Stories, జాతీయం

India:ఎన్నికలు చారెడు..ఖర్చులు బారెడు

  • ధనస్వామ్యంగా మారుతున్న జనస్వామ్య దేశం
  • భారత్ లో భారీగా పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చులు
  • ఈసారి ఎన్నికల ఖర్చు రూ.1.35 లక్షల కోట్ల అంచనా
  • దాదాపు ఒక రాష్ట్ర బడ్జెట్ తో సమానమైన ఖర్చు
  • 2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు రూ.60 వేల కోట్లు
  • అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు అయ్యే ఖర్చు రూ.12 లక్షలు
  • భారత్ సార్వత్రిక ఎన్నికలలో మొత్తం ఓటర్లు 96 కోట్లు
  • ఒక్కో ఓటరుపై సగటున రూ.1400 రూపాయల ఖర్చు

Costly process of Indian elections political parties follows ec limitations:
ప్రతిసారీ ఎన్నికలు వస్తుంటాయి..పోతుంటాయి. ఓటు అనగానే వేలిమీద ముద్ర వేయించుకోవడమే కదా అని అనుకుంటారు. కానీ దాని వెనక లక్షల కోట్లు ఖర్చు ఉంటుంది. అదంతా కూడా ప్రజాధనమే. ప్రజతో ఓట్టేయించుకుని అధికార పీఠంపై కూర్చుండే ప్రభుత్వం మళ్లీ టాక్సుల రూపంలో జనం నుండి వసూళ్లకు పాల్పడుతుంది. అయితే ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో భారీగా ధనప్రవాహం విచ్ఛలవిడిగా పెరిగిపోయింది. ఈ సారి జరుగుతున్న ఎన్నికల ఖర్చు రూ.1.35 లక్షల కోట్ల అంచనా. దాదాపు ఓ రాష్ట్ర బడ్జెట్ తో సమానమైన ఖర్చు. పైగా ప్రపంచదేశాలలోనే ఇవి అత్యంత ఖరీదైన ఎన్నికలు. అయితే దాదాపు అన్ని పార్టీలు ఎవరికివారు పెట్టే ఖర్చు అంతా కలిపి యావరేజ్ అన్నమాట. వాస్తవ లెక్కల ప్రకారం ఇంకా ఎక్కువే. కాకపోతే ఎన్నికల నిబంధనలు అనుసరించి చేయవలసిన ఖర్చు అన్నమాట. 2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు రూ.60 వేల కోట్లు . అగ్ర రాజ్యం అయిన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు 2020 సంవత్సరంలో అయిన ఖర్చు రూ.12 లక్షల కోట్లు. దేశం మొత్తం మీద ఈ సార్వత్రిక ఎన్నికలలో ఉన్న ఓటర్లు 96 వేల మంది. ఒక్కో ఓటరు మీద యావరేజ్ గా 1400 రూపాయల ఖర్చు పెట్టినట్లు అన్నమాట. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు అనగానే యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. అయితే రూ.1.35 లక్షల కోట్ల ఖర్చులో సగానికి సగం బీజేపీదే కావడం గమనార్హం.

ఎన్నికల వ్యయం పెరుగుతునే ఉంటుంది

వాస్తవానికి అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయం, ఎన్నికల కమిషన్ కు సమర్పించే లెక్కలలో చాలా మటుకూ తేడా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. 2019 లోక్ సభ ఎన్నికలలో యావరేజ్ న ఒక్కో ఎంపీ రూ.50 లక్షలు ఖర్చుపెట్టారు. 2014తో పోలిస్తే ఇది 25 శాతం అధికం. అదే 2009 ఎన్నికలతో పోటిస్తే 67 శాతం ఎక్కువ. 2019 లోక్ సభ ఎన్నికలలో 474 మంది ఎంపీల ఆస్తులు కోటి రూపాయలకన్నా ఎక్కువే. ిక రాజకీయ పార్టీలనుంచి వచ్చిన మొత్తాలే కాకుండా అభ్యర్థులు ఖరర్చుపెట్టినట్లు సమర్పించే సగటు వ్యయం 2009లో రూ.30 లక్షలు ఉంటే 2014 ఎన్నికలలో రూ.40 లక్షలు గా ఉంది. అదే ఏడాది ఎన్నికల క మిషన్ విధించిన అత్యధిక పరిమితి ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షలు. గత 20 సంవత్సరాలుగా వాస్తవిక ఎన్నిక వ్యయం దాదాపు 500 శాతానికి పైగా పెరిగిపోయిందనేది వాస్తవం. ముఖ్యంగా రాజకీయ పార్టీల వ్యయాలపై సరైన నియంత్రణ లేదు. దీంతో ఆ లొసుగులను తెలుసుకుని రాజకీయ నాయకులు ఆ నిబంధనలను తెలివిగా వాడుకుంటూ వస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో దాని కింద ఎక్కువ ఖర్చులు చూపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీల డిక్లరేషన్ల ప్రకారం బీజేపీ రూ.755 కోట్లు ఖర్చుపెట్టగా కాంగ్రెస్ మాత్రం రూ.488 కోట్లు ఖర్చుపెట్టింది. అసలైన ఖర్చులతో పోలిస్తే ఇది సముద్రంలో నీటి బొట్టంత.

ఖర్చులెందుకింత?

ఎన్నికల ఖర్చులు పెరగడానికి కొన్ని సహేతుక కారణాలూ ఉన్నాయి. 1951లో తొలి ఎన్నికల వేళ ఒక్కో ఎంపీ దాదాపు 8 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించగా.. ఇప్పుడా సంఖ్య 20 లక్షలను దాటిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. 1970 నుంచి పార్లమెంట్‌ స్థానాల సంఖ్య స్థిరంగా ఉండిపోవడం కూడా దీనికి మరో కారణం. దీంతో ఓటర్లందరిని చేరడానికి అభ్యర్థి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈక్రమంలో పోటీ కూడా పెరగడంతో.. ప్రత్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందుండేందుకు అభ్యర్థులే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సివస్తోంది. చేతి ఖర్చులు, పోస్టర్లు, స్పీకర్లు, వాహనాలు, భోజనాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఆ జాబితా చాలా ఉంటుంది. మరోవైపు పార్టీలు మాత్రం రాష్ట్ర శాఖలకు సొమ్ము పంపి.. మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేస్తాయి. ఇప్పుడు ఖరీదైన పార్టీ వ్యూహకర్తలు, డిజిటల్‌ విభాగాలు దీనికి తోడయ్యాయి. 2019లో భాజపా గూగుల్‌ యాడ్స్‌కు రూ.12 కోట్లు వెచ్చించగా.. డీఎంకే రూ.4 కోట్లు, కాంగ్రెస్‌ రూ.3 కోట్లు చెల్లించాయి. ఈ ఖర్చు మెల్లగా పెరుగుతూ వస్తోంది. 2023 ఏప్రిల్‌ 1 నాటికి కమలం పార్టీ రూ. 42 కోట్లు, హస్తం పార్టీ రూ.19 కోట్లు వెచ్చించాయి.

డిజిటల్ మీడియాదే హవా..

భారత్ లో దాదాపు 65 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని అంచనా. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడేవారిలో 80 శాతం మందికి పైగా సోషల్ మీడియా ప్రభావితులే. 2019 సంవత్సరం నుంచి రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ప్రచారంపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నాయి. 2019 ఎన్నికలలో బీజేపీ ఫేస్ బుక్ లో దాదాపు రూ.5 నుంచి 6 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రూ.1.50 కోట్లు ఫేస్ బుక్ ప్రచారానికి ఖర్చుపెట్టింది. అయితే 2024 లెక్కలు ఏం చెబుతున్నాయంటే దాదాపు ప్రస్తుతం దేశంలో 36 కోట్ల మంది భారతీయులు ఫేస్ బుక్ ని వాడుతున్నారు. అందుకే గతంలో కన్నా ఈ సారి ఫేస్ బుక్ ద్వారా అన్ని వర్గాలకు చేరుకోవాలని దాదాపు అన్ని పార్టీలు ప్రత్యేకంగా ఓ సోషల్ మీడియా గ్రూప్ ను తయారు చేసుకుని రకరకాల ప్రచార గిమ్మిక్కులతో జనాలను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి పార్టీ కూడా సోషల్ మీడియా సైన్యాన్ని సిద్ధం చేసుకుని ఈ సారి ఎన్నికల రణరంగంలో దిగాయి. ఎన్నికలలో వీటి ప్రభావం తక్కువ అంచనా వేయలేము.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్