Fire Accident In mirchowk
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర విషాదం.. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి..

Hyderabad: హైదరాబాద్‌లో ఆదివారం పూట ఘోర విషాదం చోటుచేసుకున్నది. భాగ్యనగరంలోని ఛార్మినార్‌కు (Charminar) అతి సమీపంలోని గుల్జార్ హౌస్‌లో (Gulzar Houz) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, నలుగురు మహిళలు ఉండటం పెను విషాదాన్ని కలిగించే విషయం. స్థానిక సమాచారం ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక, పోలీసు, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసిన కాపాడారు. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదంతో బిల్డింగ్‌లో ఉన్న పలువురు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారంతా ఉస్మానియా, మలక్‌పేటలోని యశోద, డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. కాగా, గుల్జార్‌ హౌస్‌ పరిసరర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకున్నది. దీంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మృతులు వీరే..
ప్రహ్లాద్‌ (70), మున్నీ (70), రాజేందర్‌ మోదీ (65), సుమిత్ర (60), వర్ష (35), పంకజ్‌ (36), రజినీ (32), అభిషేక్‌ (31), శీతల్‌ (35), హమేయ్‌(7), ప్రియాంశ్‌ (4), ఇరాజ్‌ (2), ఆరుషి (3)
రిషభ్‌ (4), అనుయాన్‌ (3), ఇద్దు (4), ప్రథమ్‌ (1)లు మృతి చెందారు. ప్రమాదంలో నలుగురు వృద్ధులు, ఐదుగురు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారే. అయితే మృతుల్లో 8 మంది చిన్నారులే ఉండటం హృదయవిదారకం. ఈ ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.

Fire Accident

ప్రధాని సంతాపం..
పాత బస్తీలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.

కుట్ర ఏమీ లేదు..
ఈ ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు, మంత్రులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు. వివరాలు అడిగిన తెలుసుకున్న ఆయన.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు. ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగిందని.. 6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సీఎంకు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Hyderabad Tragedy

బాధాకరం..
ఈ అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదని ఆయన ఆరోపించారు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేదని, ఇది నిజంగా బాధాకరమైన విషయం అన్నారు. ‘ కేంద్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత మరింత పెరిగింది. ఫైర్‌ సిబ్బంది టెక్నాలజీని మెరుగుపరుచుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఇకపైన చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు, ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. చిన్న ప్రమాదమే అయినా, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’ అని ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు.

Hyd Fire Accident

దురదృష్టం.. చాలా బాధగా ఉంది!
ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం. చాలా బాధేసింది. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మంటలు త్వరగా అదుపులోకి రావాలి. సహాయక చర్యలకు బీఆర్ఎస్ బృందం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రకటించారు.

Read Also- Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?