Saturday, May 18, 2024

Exclusive

Hyderabad : చే’జారిన బామ్మర్ది

  • కాంగ్రెస్ లో చేరిన ఎడ్ల రాహుల్ రావు
  • రాహుల్ రావు కేటీఆర్ భార్య తరపు బంధువు
  • కేటీఆర్ పోకడలు నచ్చకే కాంగ్రెస్ లో చేరిన రాహుల్ రావు
  • బావమరిదినే వారించలేని కేటీఆర్ కు ఇక పార్టీపై పట్టేముంటుంది అని ట్రోలింగ్ చేస్తున్న నెటిజెన్లు..
  • కేటీఆర్ ఒంటెద్దు పోకడతోనే దూరం అవుతున్న పార్టీ క్యాడర్
  • అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికీ కేటీఆర్ తీరే అంటున్న సీనియర్లు
  • ఇప్పటికీ అదే తీరుగా ప్రవర్తిస్తున్న కేటీఆర్

KTR Brother-in-law joined in Congress: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలోని నేతలు వరుసగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న మొన్నటిదాకా తమ పార్టీని వీడిన వారిని కేసీఆర్ కుక్కలు, నక్కలతో పోల్చారు. కేటీఆర్ అయితే వాళ్లును మళ్లీ పార్టలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు. నిబద్ధతతో పనిచేసేవారే పార్టీలో ఉంటారు. అని చాలా మాటలు అన్న కేటీఆర్ కు పెద్ద షాక్ ఇస్తూ ఏకంగా వరుసకు బావమరిది అయిన రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. ఇప్పుడు అంతా కేటీఆర్ ను ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. సొంత బావమరిదినే వారించలేనోడికి ఇక పార్టీ పై పట్టు ఏముంటుందని అడుగుతున్నారు. ఇక మీడియా సమావేశాలలోనూ విలేకరులు అడిగే ప్రశ్నలలో ఇది కూడా ఉంటుంది. ‘ మీ బావ మరిది ఎందుకు కాంగ్రెస్ లో చేరాడు‘ అని…మరి దానికి కూడా కేటీఆర్ సిద్ధంగా ఉండాలి.

పార్టీ అంతర్గత కలహాలకు కారకుడు కేటీఆర్

కేటీఆర్ ఒకప్పుడు ఈ పేరు చాలు బీఆర్ఎస్ శ్రేణులు కాబోయే సీఎంగా ఎంతగానో ఊహించుకున్నారు. కేసీఆర్ కూడా పుత్ర వాత్సల్యంతో పార్టీకి సెకండ్ గ్రేడ్ ఇవ్వడమేగాక…యువరాజకు పట్టాభిషేకం కూడా చేసేసి…ఆగమేఘాలమీద పార్టీ పేరును మార్చేసి తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేద్దామని భ్రమించారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవుకదా…జాతీయ రాజకీయాల మీద మోజుతో కేసీఆర్ దేశంలోని ప్రముఖ పార్టీ నేతలతో మంతనాలు జరిపే ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రాన్ని యువరాజుకు అప్పజెప్పారు. ఇక పార్టీకి అన్నీ తానై తన భజన చేసేవారిని నెత్తిన పెట్టుకున్నారు కేటీఆర్. దాదాపు పదవి లేని సీఎంలా వ్యవహరించారు. ఒక్కోసారి సీనియర్ నేతలను కూడా లెక్కచేసేవాడు కాదు. దానితో పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. జాతీయ రాజకీయాల మోజులో పడ్డ కేసీఆర్ కు ఇవేమీ పట్టలేదు. పట్టించుకునే తీరుబడీ లేదు. అధికారం కోల్పోయాక గానీ తెలిసిరాలేదు ఎంత పెద్ద తప్పిదం జరిగిందో..

పార్టీని వీడిన నేతలపై నోటి దురుసు

మొదటినుండి అహంకారంలో కేసీఆర్ ను మించి మాట్లాడే కేటీఆర్ తాను మంత్రి కాదని తెలిసినా పార్టీ సీనియర్లపై పెత్తనం కొనసాగిస్తూనే ఉన్నారు. ఓడిపోయిన బాధలో ఫాం హౌస్ కే పరిమితమైపోయిన కేసీఆర్ బాధ్యతలు కేటీఆర్ తీసుకున్నారు. ఆ నిర్ణయమే పార్టీ కి చేటు తెచ్చింది. పార్టీని వీడి వెళ్లే వాళ్లే ఎక్కువచ్చారు. ఇక పార్టీలోకి వచ్చేవారి సంఖ్య రానురానూ జీరో కి వచ్చేసింది. అయినా వెళ్లిపోదామనుకునేవారిని బుజ్జగించక ఇష్టమున్నవాళ్లను ఉండమని…లేకుంటే పొమ్మని…వాళ్లు తేకున్నా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదంటూ అహంకారపూరితంగా మాట్లాడుతూ వస్తున్నారు కేటీఆర్. పైగా తమ బలం ఏమీ లేదని తెలిసినా సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చిన నాటినుంచి ఆయన ప్రభుత్వాన్ని కూలగొడతాం, చేతకాని సీఎం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్. పార్టీ ఓటమి, గెలుపులు ప్రజల చేతుల్లో ఉంటాయి. ఏ పార్టీని గద్దెనెక్కించాలి, ఏ పార్టీని దించాలని నిర్ణయించేది ప్రజలే. ఓడిపోయిన స్థితిలో ఏ పార్టీ అయినా సంయమనం పాటిస్తుంది. కొంతకాలం ఎదుటి పార్టీకి అవకాశం ఇస్తుంది. సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ స్వీకారం చేసిన మర్నాటినుంచే కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

మాటల్లో తండ్రిని మంచి మాట్లాడుతున్న కేటీఆర్

అసలు పార్టీ కి పట్టుకొమ్మల్లా ఉన్న సీనియర్ నేతలంతా ఎందుకని బీఆర్ఎస్ ను వీడుతున్నారో ఏ రోజైనా తెలుసుకున్నారా? కేటీఆర్ ఒంటెద్దు పోకడతోనే విసిగిపోయిన వాళ్లంతా పార్టీ మారుతున్నారు. పైగా వెళ్లిపోయిన వాళ్లను కించపరుస్తూ మాట్లాడుతున్న కేటీఆర్, కేసీఆర్ కొన్ని సార్లు హద్దులు కూడా దాటేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే కేటీఆర్ ఫ్యామిలీ పరంగా కొంతకాలంగా చిక్కుల్లోనే ఉన్నారు. అప్పట్లో కేటీఆర్ మామ ఫేక్ ఎస్టీ సర్టిఫికెట్ తో దాదాపు 30 సంవత్సరాలు ప్రభుత్వ పదవిలో ఉన్నాడని రేవంత్ రెడ్డి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ కేటీఆర్ అప్పటినుంచీ మామ కు దూరంగా ఉంటూ వచ్చారు. మామగారు చనిపోయిన కార్యక్రమంలోనూ అంటీముట్టనట్టుగా ఉన్నారు. అంతేకాదు తన భార్య తరపున బంధువులందరినీ దూరం పెడుతూ వస్తున్న కేటీఆర్ కు పెద్ద షాకే ఇచ్చాడు బావమరది వరుస అయిన ఎడ్ల రాహుల్ రావు. ఇతను కేటీఆర్ భార్యకు కజిన్ బ్రదర్ అవుతాడు. కేటీఆర్ నియంత పోకడలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ రావుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం ఎన్నికల వేళ పతాకస్థాయికి చేరుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనడంతో ఈ...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ - భేటీని వాయిదా వేసిన సీఎం రేవంత్ రెడ్డి - అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలవాలని నిర్ణయం - ఇరిగేషన్ శాఖపై...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బాహాటంగా ప్రకటిస్తున్నారు. చాలా సార్లు ఈ విషయమై ఆయన వివాదాల్లోనూ చిక్కుకున్నారు. రామ్ గోపాల్...