Veera Raghava Reddy | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన వీర రాఘవరెడ్డి గురించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో అతను ఏమేం చేశాడు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడనే విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. రామరాజ్యం పేరుతో ఆయన ఓ ఆర్మీనే ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రధానంగా గోత్రాల విషయంలోనే అతను రచ్చ చేస్తున్నట్టు తెలుస్తోంది. రంగరాజన్ మీద దాడి చేసిన అతను నెక్ట్స్ టార్గెట్ చిన్నజీయర్ స్వామినే పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
మూడు నెలల క్రితం వీర రాఘవరెడ్డి ఓ వీడియో చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో అతను మాట్లాడుతూ.. చిన్నజీయర్ తన వద్దకు వచ్చే వారందరినీ రామానుజ గోత్రంతో పిలుస్తున్నారు. దాంతో గోత్రాలన్నీ కలిపేసే కుట్ర చేస్తున్నారంటూ అందులో ఆరోపించాడు వీర రాఘవరెడ్డి. తమ గోత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని.. చిన్నజీయర్ అలా ఎలా చేస్తాడంటూ వీర రాఘవరెడ్డి అందులో ఆరోపిస్తున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా చిన్నజీయర్ నే వీర రాఘవ తర్వాత టార్గెట్ గా పెట్టుకున్నాడేమో అంటున్నారు.