Sriramanavami 2025: ఈ నెల ఆరో తేదీన శ్రీరామనవమి ( sriramanavami ) పండుగ జరుపుకోనున్నారు. అయితే, ఈ క్రమంలోనే పోలీసులు, వివిధ శాఖ అధికారులతో సీపీ సీవి ఆనంద్ కో ఆర్డినేషన్ మీటింగ్ ను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ” శోభా యాత్ర.. శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలి. సీతారాం భాగ్ నుంచి శ్రీరామ నవమి శోభాయాత్ర మొదలవుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకి శోభాయాత్ర ప్రారంభం అయ్యేలా నిర్వహకులు చూడాలి. శోభాయాత్ర దారులు చిన్నగా ఉంటాయి. భారీ టస్కర్ వాహనాలు వెళ్లే అవకాశం కూడా ఉండదు. అందుకే టస్కర్ వాహనంతో ముందు ఒకసారి ట్రయల్స్ నిర్వహించాలని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ ” విగ్రహాల ఎత్తు కూడా చిన్నగా ఉండేలా చూసుకోవాలి. డ్రోన్స్ ఎగుర వేయాలి అంటే ముందుగా మాకు సమాచారమివ్వాలి. డిజే సౌండ్ వల్ల అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయి. శోభాయాత్రలో డిజే సౌండ్స్ తక్కువగా ఉండేలా చూడాలి. శోభాయాత్రలో పెద్ద పెద్ద డీజే శబ్దాలు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని” సూచించారు.
అలాగే, శోభాయాత్రలో పాటలు వేరే వర్గాలను కించ పరిచేలా అస్సలు ఉండకూడదు. శోభాయాత్రలో ఇబ్బంది లేకుండా రోడ్డుకు ఇరువైపులా డయాస్‌లు వేసుకోవాలి. జాయింట్ కంట్రోల్ రూమ్ ఐసీసీసీలో ఏర్పాటు చేసి శోభాయాత్ర పర్యవేక్షిస్తాము. ఇరవై నాలుగు గంటలు కరెంట్, బ్యాక్ అప్ కోసం జనరేటర్లు ఏర్పాటు చేస్తాము. ఆర్టీసీ నుండి డ్రైవర్లు, కండక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రసాదాల కౌంటర్లు శోభాయాత్రకు అడ్డు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఈ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు.