Begumpet Airport | బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం సంభవించింది. ల్యాండ్ అవుతున్న సమయంలో ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ అదుపుతప్పి పక్కకి ఒరిగిపోయింది. అయితే ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో రన్ వే బాగా దెబ్బతింది. దీంతో అధికారులు రన్ వే కి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం 15 నిముషాలు ఆలస్యం అయింది.
