Kalki movie chief guests
Cinema

Movie news:‘కల్కి’ గెస్టులుగా చంద్రబాబు, పవన్ ?

Hero Prabhas movie kalki prelease event guests Babu Pavan:
టాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ మూవీలలో ఒకటిగా చెప్పుకుంటున్న సినిమా కల్కి. ప్రస్తుతం ఈ బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా అందరి నోళ్లలో నానుతున్న సినిమా. గత ఆరు నెలలుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయని టాలీవుడ్ సినిమాలకు ఊపునిచ్చేలా ప్రభాస్ కల్కి మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతోంది.
మ‌రో పది రోజుల్లో ‘క‌ల్కి’ విడుద‌ల కాబోతోంది. ఈలోగా ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది చిత్ర‌బృందం. ఇప్ప‌టికే ఒక పాట విడుద‌ల చేసింది. మ‌రి కొంత ప్ర‌మోష‌న్ స్ట‌ఫ్ విడుద‌ల‌కు రెడీగా ఉంది. ‘క‌ల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగా చేయాల‌ని అశ్వ‌నీద‌త్ భావిస్తున్నారు. అమితాబ్, ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్‌, చిరంజీవి లాంటి సూప‌ర్ స్టార్ల‌ని ఒకే వేదిక‌పై చూసే అవ‌కాశం ఉంది. ఆ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చీఫ్ గెస్ట్ లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించనున్నారని సమాచారం.

మొత్తం నాలుగు పాటలు

ఈ సినిమాలో కేవ‌లం రెండే రెండు పాట‌లు ఉంటాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాలో మొత్తం నాలుగు పాట‌లున్నాయి. ఇప్ప‌టికే ఒక‌టి విడుద‌ల చేశారు. మ‌రో రెండు పాట‌ల్ని కూడా వినిపిస్తారు. ఒక పాట‌ని థియేట‌ర్ల‌లోనే చూడాలి. క‌ట్ చేస్తే పాట‌ టైపు సాంగుల‌కు నాగ అశ్విన్ బ‌హుదూరం. పాటంటే క‌థ‌తో పాటే ప్ర‌యాణం చేయాలి అని న‌మ్మే ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్‌. అందుకే ఈ సినిమాలో పాట‌ల‌కు తక్కువ స్పేస్ ఇచ్చారు. ఇది వ‌ర‌కెప్పుడూ చూడ‌ని కొత్త ప్ర‌పంచాన్ని ఈ సినిమా కోసం నాగ అశ్విన్ సృష్టించాడ‌న్న సంగ‌తి టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తో అర్థ‌మ‌వుతోంది. పాట‌లూ కొత్త త‌ర‌హా అనుభూతిని పంచేలా ఉంటాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది.