సూపర్ ఎక్స్‌క్లూజివ్

Uttar Pradesh : జై శ్రీరామ్ అని రాస్తే ఫస్ట్ క్లాస్ 

  • యూపీ యూనివర్సిటీలో వెలుగులోకి వచ్చిన బాగోతం
  • కాసులకు కక్కుర్తిపడి ప్రొఫెసర్ల అండతో గట్టెక్కేస్తున్న విద్యార్థులు
  • విద్యార్థి సంఘం నాయకుడి ఆరోపణతో బయటపడ్డ యూనివర్సిటీ డొల్లతనం
  • రామ నినాదం, క్రికెటర్ల పేర్లు, పాటలతో సమాధాన పత్రాలు నింపిన విద్యార్థులు
  • ఒక్కో విద్యార్థికి 60 శాతం పైగా మార్కులు
  • సమాధాన పత్రాలు ఇంకా పరిశీలించలేదని వీసీ బుకాయింపు
  • ఆర్టీఐ చట్టం కింద బయటకొచ్చిన సమాధాన పత్రాలు

Uttar Pradesh University Exam paper Professors scam:
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు, ప్రముఖ పాటలు కావేవీ పరీక్ష సమాధానాలకు అనర్హం. ఏ చెత్త రాసినా ఫస్ట్ క్లాస్ ఖాయం అక్కడ. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పవలసిన ఉన్నత స్థాయి అధ్యాపకులే డబ్బులకు ఆవపడి పరీక్ష పేపర్లలో ఏ చెత్త రాసినా మంచి మార్కులు వేసేస్తుంటే ఇక కష్టపడి చదివే విద్యార్థులకు విలువేముంటుంది. నకిలీ వస్తువులులాగా విద్య కూడా నకిలీగా మారిపోతోంది. ఉన్నత విద్య ఉత్తగా మారిపోతోంది. యూపీలో పూర్వాంచల్ యూనివర్సిటీలో భారీ కుంభకోణం బయటకు వచ్చింది.


జై శ్రీరామ్, పాటలు
ఉత్తర్ ప్రదేశ్ లోని వీర్‌బహదూర్ సింగ్ పూర్వాచల్ యూనివర్సిటీలో తాజాగా షాకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొందరు ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని విద్యార్థులను పాస్ చేసినట్టు అక్కడి విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు ఆరోపించారు. డబ్బులు తీసుకుని ఏం రాసినా పాస్ చేసేశారని స్టూడెంట్ లీడర్ దివ్యాన్షూ సింగ్ మండిపడ్డాడు. జై శ్రీరామ్ నినాదం, క్రికెటర్ల పేర్లు, పాటలు.. ఇలా నోటికొచ్చింది రాసిన విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని, కొందరికి 60 శాతానికి పైగా మార్కులు వచ్చాయని కూడా పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం కింద కొన్ని సమాధాన పత్రాలను పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.

చర్యలు తీసుకుంటామని హామీ
యూనివర్సిటీ ప్రొఫెసర్ల బాగోతం గురించి దివ్యాన్షూ సింగ్ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు యూనివర్సిటీ వీసీకి కూడా లేఖ రాశాడు. ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది కుమ్మక్కై సున్నా మార్కులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేశారని ఆరోపించాడు. ఈ ఉదంతంపై స్పందించిన యూనివర్సిటీ వీసీ వందన సింగ్..ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులకు అదనపు మార్కులు ఇచ్చిన విషయాన్ని కమిటీ తన రిపోర్టులో పేర్కొందని అన్నారు. సమాధాన పత్రాల్లో జైశ్రీరామ్ నినాదాల గురించి ప్రస్తావించగా తాను ఆ పత్రాలను ఇంకా చూడలేదని వీసీ తెలిపారు. కానీ అసంబద్ధ సమాధానాలకు మార్కులు కేటాయించినట్టు ఓ సమాధాన పత్రాన్ని తాను చూసినట్టు తెలిపారు. ఆ సమాధాన పత్రంలోని చేతిరాత కూడా అర్థం కాని విధంగా ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఘటనపై గవర్నర్ కార్యాలయం కూడా స్పందించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీసీకి లేఖ రాసింది.


Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు