Sand Mafia Transport
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Sand Mafia: సాండ్ అక్రమాలకు ఇవిగో సాక్ష్యాలు

  • ఏసీబీ దాడుల్లో బయటపడ్డ చెక్ పోస్టుల దందా
  • ఓవర్ లోడ్ వే బిల్‌పై నో చెకింగ్
  • టీజీఎండీసీ డీడీలను సైతం పరిశీలించని వైనం
  • వందల లారీలతో ఇసుక అక్రమ రవాణా
  • ఒక్క శ్రీకరే కాదు అందరికీ ఇదే రాచమార్గం
  • నిర్లక్ష్యంతో సన్న బియ్యం సైతం పక్క రాష్ట్రాలకు?
  • స్వేచ్ఛ కథనాలతో సిండికేట్, అధికారుల్లో వణుకు
  • సహజ వనరులను కాపాడుకోకపోతే తీరని నష్టం
  • అందుకే స్వేచ్ఛాయుతంగా ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేటివ్ కథనాలు

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్

Sand Mafia: ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ‘స్వేచ్ఛ’ కథనాలు సంచలనంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నది. కానీ, రాజకీయ అండదండలతో సాండ్ సిండికేట్ రెచ్చిపోతూనే ఉన్నది. వందల ఏండ్లుగా నదిలో మేట వేసిన ఇసుకను భారీ మెషిన్లతో తోడేస్తున్న తోడేళ్లకు డబ్బులు తప్ప పకృతి, సహజ వనరుల విలువ తెలియదు. ప్రభుత్వ పెద్దలను బురిడీ కొట్టించి చిల్లర డబ్బులు వెదజల్లి కోట్లాది రూపాయలను పోగేసుకుంటున్నారు. స్థానిక పీఓల నుంచి కలెక్టర్ల వరకు అందరి కళ్లు గప్పి అక్రమాలకు పాల్పడుతున్నారు. పట్టా భూముల్లో మేట ఇసుక తీసివేత అంటూ చెప్పుకుని నడి గోదావరిలో ఇసుక తీసుకొచ్చి వారి పొలాల్లో పోసుకుంటూ దందాలు చేస్తున్నారు. ఇక, ఓవర్ లోడ్‌లు, ప్రభుత్వ డీడీలతో అక్రమాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేది చెక్ పోస్టులే. కానీ ఇసుక మాఫియా వాటిని కూడా కొనేసిందనే ఆరోపణలు ఉన్నాయి.


ఏసీబీకి పట్టుబడకుండా ఏజెంట్లు

భద్రాచలం, పాల్వాంచ ఇసుక దందాకు చెక్ పెట్టేందుకు చెక్ పోస్ట్ ఒక్కటే ఉంది. పాల్వాంచ వద్ద ఆర్టీఏ, ఫారెస్ట్ అధికారులు ఉంటారు. చెక్ పోస్టులో లారీల వే బిల్స్ ఆర్టీఏ చెక్ చేయాలి. ఓవర్ లోడ్ ఉంటే కేసులు నమోదు చేయొచ్చు. మైనింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి తీసుకున్న డీడీలు వెంట ఉన్నాయో లేదో చెక్ చేయాలి. చెక్ పోస్ట్ అధికారులు స్కానింగ్ చేసి ముద్ర వేస్తారు. కానీ, అలాంటివి పట్టించుకోకపోవడంతో మళ్లీ మళ్లీ అదే డీడీలతో ఇసుకను తోడేస్తున్నారు. చెక్ పోస్ట్ దగ్గర అనుమతి లేని లారీ వెయ్యి రూపాయలు, ఓవర్ లోడ్ లారీ రూ.500 ఎజెంట్ పెట్టే హుండీలో వేసి వెళ్లిపోతే సరి. ఏసీబీ దాడులు చేస్తే దొరకకుండా ఉండేలా ఇసుక మాఫియా వేసిన ప్లాన్ ఇది. ఇసుకతోపాటు అక్రమ రేషన్ బియ్యం కూడా తరలి వెళ్తున్నది. ఇలా అనేక అక్రమ రవాణాలకు చెక్ పోస్టులు అండగా నిలుస్తున్నాయి. వీరంతా ప్రైవేట్ వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని అర కిలోమీటర్ దూరంలో హుండీలు పట్టుకుని నిల్చుంటారు. అందులో డబ్బులు వేసి వాహనం ముందుకు వెళ్లాలి. అందులో ఏం ఉంది. సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని చూడడం లేదు. ఏజెంట్లు రోజుకు రూ.8 వేలు ఇస్తారు. చెక్ పోస్టు వద్ద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు వసూలు అవుతున్నట్లు కీలక సమాచారం. వందల కోట్లు అక్రమ బిజినెస్ చేసే ఇసుక మాఫియా ఈ చెక్ పోస్టులను కొనేసి అందరినీ మాముళ్ల మత్తులో ముంచి దొరకుండా ఆటలాడుతున్నది.

Read Also- Husband Killers: చంపడానికి ఉన్న ధైర్యం.. చెప్పడానికి లేదేంటి?

స్వేచ్ఛ కథనాలతో కదలిక

ఏసీబీ ఆర్టీఓ, సబ్ రిజిస్ట్రార్, చెక్ పోస్టులపై ఏడాదికి రెండు సార్లు సాధారణ తనిఖీలు చేస్తుంటారు. బీఆర్ఎస్ హయాలో ఇవేమీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిపై గురి పెట్టడంతో చాలామంది అధికారులు పట్టుపడ్డారు. అయితే, ఇదే సాధారణ తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొతం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. శనివారం అన్ని చెక్ పోస్టుల్లో దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎజెంట్లు పరారయ్యారు. దీంతో రూ.3 లక్షలు మాత్రమే పట్టుకున్నారు. ఈ అవినీతిపై ప్రభుత్వానికి ఏసీబీ త్వరలోనే నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక్కడ పోస్టింగుల కోసం లక్షల్లో వసూలు చేసే ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తున్నది. పొలిటికల్ పైరవీలతో ఇసుక మాఫియాతో ఆర్టీఏ అధికారులు అంటకాగుతుండడం వల్లే దందా యథేచ్ఛగా సాగుతున్నది.

Read Also- Kannappa: మోహన్ లాల్, ప్రభాసే.. ‘కన్నప్ప’పై దర్శకేంద్రుడి రివ్యూ!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ