sonia arriving hyderabad
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad: సోనియా..ఆగయా

  • తెలంగాణ ఆవిర్భవ దినోత్సవానికి హాజరు కానున్న సోనియాగాంధీ
  • ఢిల్లీకి వెళ్లి ఒప్పించిన సీఎం..ఫలించిన రేవంత్ రెడ్డి కృషి
  • రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం
  • ఎయిర్ పోర్ట్ నుంచి పరేడ్ గ్రౌండ్ దాకా భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాట్లు
  • తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారుల బృందాల నృత్యాలు
  • రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి సోనియా ప్రసంగించేలా ఏర్పాటు
  • తెలంగాణ ఇచ్చిన సోనియాకు ప్రత్యేక సత్కారం చేయనున్న కాంగ్రెస్
  • పదేళ్లుగా సోనియా ప్రస్తావన లేకుండా చేసిన కేసీఆర్

Sonia Gandhi given green signal to arrive telangana formation day:
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ఆవిర్భవ వేడుకలకు హాజరు అవుతారని సమాచారం. ఈ విషయంలో ఆమెను ఒప్పించడంతో సీఎం రేవంత్ రెడ్డి సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. సోనియా రాకపై గత కొన్ని రోజులుగా సంధిగ్ధత నెలకొన్న నేపథ్యంలో సీఎం రేవంత్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆమెను ఒప్పించగా..ఎట్టకేలకు సోనియా రాకపై స్పష్టత రానుంది. ఇప్పటికే హైదరాబాద్ గాంధీభవన్ కు ఓ క్లారిటీ వచ్చినట్లు సమాచారం. అయితే సోనియాతో పాటు రాహుల్, ప్రియాంకలు కూడా వస్తారా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సోనియా రాకపై ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి ఆఫీషియల్ ప్రకటన విడుదల చేయకపోయినా, పార్టీ నేతలు మాత్రం సోనియాకు ఆహ్వానం పలికేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు సోనియా, రాహుల్‌కు భారీ స్వాగతం పలుకుతూ సభకు వారిని సగౌరవంగా బహిరంగ సభకు చేర్చాలని పార్టీ ప్లాన్ చేసింది.


తెలంగాణ కళాకారుల నృత్యాలు హైలెట్

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ కళాకారుల బృందాలు తమ నృత్యాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి సభా ప్రాంగణం దాకా వీరి నృత్యాలు హైలెట్ కానున్నాయి. ఇందుకోసం పార్టీ సాంస్కృతిక విభాగం గత వారం రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. దారి పొడవునా తెలంగాణ ఇచ్చిన తల్లికి వందనాలు అంటూ ఎయిర్ పోర్టు నుంచి బహిరంగ సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్ వరకూ అలాగే గాంధీ భవన్ వద్దా భారీ స్థాయిలో కటౌట్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలు ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ విభాగం దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. పదేళ్ల తర్వాత..అదీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేళ జరుగుతున్న సంబురాలు కావడంతో ఎక్కడా లోటు లేకుండా అంగరంగ వైభవంగా జరపాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. గత సంవత్సరం కేసీఆర్ జరిపిన వేడుకల కన్నా ఘనంగా ఎలా జరుపుతారని పబ్లిక్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


సోనియా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా సోనియా ఏం మాట్లాడతారో అని అసక్తి నెలకొంది. అటు పార్టీ వర్గాలతో పాటు పబ్లిక్ కూడా ఎంతో ఉత్కంఠగా సోనియా స్పీచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసి గెలిపించినందుకు సోనియాగాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు. అలాగే తెలంగాణ ప్రజల తరపున సోనియా గాంధీకి సత్కారం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పదేళ్లుగా తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకుంటున్న కేసీఆర్ కు సోనియాగాంధీని సత్కరించుకోవడం ద్వారా సరైన గుణపాఠం చెప్పినట్లవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత పదేళ్ల పాటు ఇతర పార్టీ పవర్‌లో ఉండటంతో, సోనియా గాంధీకి ప్రత్యేకంగా సత్కారం చేయలేదనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దీంతో తామే పవర్‌లో ఉన్నామని, తెలంగాణ ఇచ్చిన తల్లిని గౌరవించుకుంటామని చెప్తున్నారు. ఇక ఆమె కోసం స్పెషల్ స్పీచ్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. 2004 లో నాటి కరీంనగర్ బహిరంగ సభలో ప్రత్యేక రాష్ట్రం కోసం సోనియా ఇచ్చిన వాగ్దానం నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 వరకూ జరిగిన కీలక అంశాలన్నీ సోనియా ప్రసంగంలో హైలెట్ చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలలో ప్రజలకు ఏం చేశారో, ఇకపై ప్రజలకు ఏం చేయదలచుకున్నారో వంటి అంశాలన్నీ సోనియా ప్రసంగంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

గతంలో చాలా సార్లు తిరస్కరణ

గత కొంతకాలంగా సోనియా గాంధీ పర్యటనలు అన్నీ ఆమె అనారోగ్యం దృష్ట్యా క్యాన్సిల్ అయ్యాయి. మరీ అత్యవసరం అయితే తప్ప పార్టీ కీలక మీటింగులకు మాత్రమే సోనిమా హాజరవుతూ వస్తున్నారు. గతంలో చాలా సందర్భాలతో సోనియాను తెలంగాణకు రావాలని ఆహ్వానించినా ఆమె అనారోగ్య కారణాలతో గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ సారి మాత్రం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తో ముడిపడిన అంశం కావడంతో తప్పనిసరిగా హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?