Runamafi Issue in telangana
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana : ‘రణ’మాఫీ.. పదేళ్లు కేసీఆర్ చేసిందేంటి..?

– ఇచ్చిన మాటకు కట్టుబడ్డ రేవంత్ సర్కార్
– ఆగస్టు 15 లోగా ఒకేసారి రైతు రుణమాఫీ
– బీఆర్ఎస్, బీజేపీ దీక్షలకు చెక్
– కేసీఆర్ పాలనలో అంతంతమాత్రంగానే రుణమాఫీ అమలు
– వడ్డీ కట్టని వారికి రైతు బంధు సాయం నుంచి కటింగ్
– కానీ, ఒకేసారి రుణమాఫీకి సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం


Runa mafi telangana latest news(Political news in telangana): అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటోంది కాంగ్రెస్ సర్కార్. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. అయితే, గత కొంతకాలంగా బీఆర్ఎస్, బీజేపీ పనిగట్టుకుని రైతు రుణమాఫీ అంటూ రైతులపై ప్రేమను కురిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటిదాకా రైతులకు చేసింది ఏమీ లేదనే అపవాదు ఉంది. అలాగే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా హఠాత్తుగా రైతులపై ప్రేమ పుట్టుకొచ్చింది. రైతు హామీలపై దీక్షలకు దిగారు. అటు బీజేపీ కూడా దీక్షల పేరుతో హడావుడి చేస్తోంది. రేవంత్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలనేది రెండు పార్టీల ప్లాన్. కానీ, సీఎం రేవంత్ మాత్రం విపక్షాలకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆరోపణలకు చెక్ పెడుతూ వచ్చే ఆగస్టు 15 నాటికి ఒకేసారి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

బీఆర్ఎస్, బీజేపీ రైతు రాజకీయం


కోడ్ విషయం పక్కన పెడితే పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రైతు సమస్యలు తెలియవా? అందుకేగా దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమం పేరిట ఢిల్లీలో రైతులు తిరగబడింది. పైగా తమకు న్యాయం కావాలని అడిగిన రైతులపై బీజేపీ లాఠీఛార్జీ చేయించిన సంగతి తెలియదా? దేశ వ్యాప్తంగా రైతుల పంటకు మద్దతు ధర ఇవ్వలేకపోయిన బీజేపీ నేతలు తెలంగాణలో మాత్రం రైతు సమస్యలపై ధర్నాలు, దీక్షలు చేయడంపై కాంగ్రెస్ సైడ్ నుంచి కౌంటర్స్ వినిపిస్తున్నాయి. ఇక, రైతుబంధు, రుణమాఫీ అంటూ నాడు కేసీఆర్ సర్కార్ ఏం చేసిందో ఒక్కసారి చూస్తే, రుణమాఫీ పేరుతో రైతులను ఉరించి చివరకు ఊసురుమనిపించింది. పేరుకు రూ.99 వేల రుణమాఫీ అని చెప్పారు కేసీఆర్. అలా జరగలేదు. ఒక్కో రైతుకు రూ.39 వేల నుంచి రూ.40 వేల వరకే మాఫీ అయింది. మిగతా రూ.60 వేల సంగతిపై క్లారిటీ ఇవ్వలేదు. అదేమని అంటే.. ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకుని తిరిగారు. ఈ రుణమాఫీ కూడా ఎన్నికల కోసం చేశారే తప్ప రైతులపై ప్రేమతో కాదని అప్పట్లో కేసీఆర్ సర్కార్ పై ఆరోపణలు వచ్చాయి.

వైఎస్ హయాంలో మాఫీ

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రుణమాఫీ జరిగింది. అప్పుడు రైతులకు ఉన్న రుణం ఒక్కసారిగా మాఫీ అయ్యింది. ఆ తర్వాత చాలామందికి అవగాహన వచ్చి వ్యవసాయం కోసం క్రాప్ లోన్ తీసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రుణమాఫీ సవ్యంగా జరగలేదు. చిన్న, సన్నకారు రైతులు ఆశించినట్టు ఒకేసారి లోన్ మాఫీ అవ్వలేదు. ఇందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే. రుణం తీసుకున్న వారికి గడువు విధించడంతో కొందరికే లోన్ వర్తించింది. అప్పట్లో కేసీఆర్ సర్కార్ విధించిన ఏడాది డెడ్ లైన్ కూడా అందుకు ప్రధాన కారణం అయింది. మిగతావారి పరిస్థితి ఏంటి? వారికి రుణమాఫీ చేయరా అనే ప్రశ్నలు వచ్చాయి. 2018కి ముందు తీసుకున్న వారు ఏం చేయాలి? దాంతోపాటు రూ.లక్ష దాటిన వారి రుణమాఫీ ఎందుకు చేయరనే ప్రశ్నలు అన్నదాతల నుంచి ఎదురయ్యాయి.

డెడ్ లైన్ ఎందుకు..?

సంక్షేమ పాలన అని ప్రచారం చేసుకున్న కేసీఆర్ గడువు తేదీ విధించడంతో మిగతా వారికి నష్టం జరిగిందనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నామమాత్రంగా రుణమాఫీ జరిగింది. కటాఫ్ విధించడంతో సమస్య వచ్చింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పట్లో రూ.50 వేల వరకు రుణమాఫీ చేశారు. ఆ పైన తీసుకున్న వారికి రూ.12 వేల వరకు వేశారు. ఆ డబ్బు తీసుకున్న రుణానికి సంబంధించి బ్యాంక్ అధికారులు తీసుకున్నారు. సో.. మళ్లీ లోన్ ఎప్పటిలాగే ఉంది. ఆ తర్వాత రుణ మాఫీ అని ప్రకటన చేశారు. అదీ జరగలేదు. ఎన్నికల ముందు రూ.99 వేల వరకు మాఫీ అని ప్రకటించినా, రూ.40 వేల కన్నా ఎక్కువ కాలేదు. అందుకు వారు కటాఫ్ అని, మిగతా అమౌంట్ తర్వాత అని, రకరకాల కారణాలు చెప్పారు. ఆ మాటలతో అన్నదాత గుండె మరింత భారం అయింది.

రైతుబంధు ఎందుకివ్వరు..?

కొన్ని చోట్ల రైతులు వడ్డీ కట్టకుంటే రైతు బంధు నగదు ద్వారా తీసుకున్నారు. ఇదేంటని అప్పట్లో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. బ్యాంక్ అధికారులు వినకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. తీసుకున్న రుణానికి వడ్డీ కట్టలేని పరిస్థితి కొందరిది. అలాంటి పరిస్థితుల్లో కొత్త రుణం మంజూరు చేసే పరిస్థితి లేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులు కేసీఆర్ హయాంలో తెగ ఇబ్బందిపడ్డారు. యూరియా, విత్తనాల కోసం ఇచ్చే రైతు బంధు కట్ చేయడం పట్ల ఆగ్రహంతో ఊగిపోయారు. తీరా ఇచ్చిన రుణమాఫీ కాదని వడ్డీ కింద జమ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాని కొత్త లోన్

నాటి కేసీఆర్ సర్కార్ తీరును అప్పట్లో విపక్షాలు కూడా తప్పుపట్టాయి. చేసింది రుణ మాఫీ కాదని వడ్డీ మాఫీ కాదని విమర్శలు చేశాయి. పంట నష్టం రూ.10 వేలు ఏవని ప్రశ్నిస్తే నాటి సర్కార్ నుంచి స్పందన లేదు. ఆ నిధులు ఎప్పుడిస్తారని రైతులు అడిగి అడిగి అలసిపోయారు. రుణమాఫీ అంటే సంబరపడిపోయాం, మొత్తం లోన్ మాఫీ అవుతుందని, కొత్త లోన్ తీసుకోవచ్చని అనుకున్నామని కొందరు రైతులు అప్పట్లో మీడియా ముందు బోరుమన్నారు. తమకు మళ్లీ లోన్ దొరికే పరిస్థితి లేదని రైతులు వాపోయారు. అప్పటిదాకా రైతులపై లేని ప్రేమ కేసీఆర్‌కి ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ రుణమాఫీపై ప్రకటన చేయడంతో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ప్రయత్నాలకు చెక్ పడినట్టైందని అంటున్నారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?