Reventh with seniors
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad:తప్పెక్కడ జరిగింది?

  • మిషన్-15పై పార్టీ సీనియర్లతో సీఎం అంతర్మథనం
  • పార్లమెంట్ ఎన్నికలలో కేవలం సగం శాతమే విజయంపై చర్చ
  • బీజేపీకి ఓటు బ్యాంకు షేర్ పెరగడంపైనే చర్చ
  • బీఆర్ఎస్-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ను ముందుగానే అంచనా వేయలేక పోవడం
  • కేవలం ఆరు నెలల తేడాతో 20 నుంచి 35 శాతం ఓటింగ్ పెంచుకున్న బీజేపీ
  • కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకే బీజీపీతో కలిసి బీఆర్ఎస్ కుమ్మక్కు
  • అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు భారీగా పెరిగిన ఓటింగ్ శాతం
  • బీఆర్ఎస్ కుట్రలను ముందుగా ఊహించలేకపోవడమే అంటున్న పార్టీ సీనియర్లు
  • త్వరలోనే అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి

Reventh Reddy secret meeting with congress seniors on bjp-brs match fixing:
ఒక్కోసారి ఎంతటివారికైనా అంచనాలు తప్పుతూ ఉంటాయి. ఇటీవల లోక్ సభ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు తప్పెక్కడ జరిగిందా అని విశ్లేషించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు సగభాగమే విజయం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి మిషన్-15 అంటూ పార్లమెంట్ ఎన్నికలలో 15 స్థానాలు గెలిచేలా వ్యూహాలు అమలుచేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాలలో ధీటైన అభ్యర్థులనే నిలబెట్టారు. ఖచ్చితంగా 15 స్థానాలలో గెలుపు అంచనాలు వేసి మరీ ఎన్నికల బరిలో దిగారు. కనీసం 10 నుంచి 12 స్థానాలైనా పక్కాగా వస్తాయని అనుకున్నారు. సగానికి సగమే విజయం సాధించడంపై తప్పెక్కడ జరిగిందని పునరాలోచన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనూహ్య విజయానికి రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాలు , పథకాలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశాయి. కేవలం ఆరునెలల పాలనలోనే ఏ ప్రభుత్వం పైనా వ్యతిరేకత రాదు. అందులో ఆరు నెలలలోనే దాదాపు 5 పథకాలు అమలు జరిగేలా చేయడంలో రేవంత్ రెడ్డి చేసిన కృషికి అంతా హ్యాట్సాప్ చెబుతున్నారు.


పార్లమెంట్ ఫలితాలపై సీనియర్లతో చర్చ

నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎంత ఓటు బ్యాంకు నమోదైంది, కాంగ్రెస్‌ అంచనాలు ఎందుకు మారాయనే అంశాలపై రేవంత్ రెడ్డి సీనియర్లతో చర్చించినట్లు సమాచారం. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది. ఇదొక్కటి చాలు రేవంత్ పై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని రుజువు చేసేందుకు అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆరునెలల పాలనలో ఆరు గ్యారంటీల అమలు పై ప్రజలలో నమ్మకం ఏర్పడిందనడంలో ఎలాంటి సందేహం లేదని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 20 శాతం ఓట్లను మాత్రమే సాధించిన బీజేపీకి కేవలం ఆరునెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 35 శాతం ఎందుకు పెరిగింది అనే విషయంపై తీవ్రంగా చర్చ జరిపినట్లు సమాచారం.


బీజేపీ-బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్

అసలు మిషన్-15 అంచనాలు తప్పడం వెనక బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగే కారణం అని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఉన్నట్టయితే కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారేదని, కానీ రెండు పార్టీలూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావించి లోపాయకారీగా వ్యవహరించడం వల్లనే అంచనాలు తప్పాయని చర్చించుకున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ పెద్దలు, అభ్యర్థులు గమనించారని, గెలవడం కష్టమేనన్న అభిప్రాయానికి వచ్చి బీజేపీకి సాయం చేసే ఎత్తుగడలను అవలంబించారనే భావనకు వచ్చారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లుతాయనే అంశాన్ని తొలుత సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోలేకపోయామని, దాని తీవ్రతను గుర్తించినట్టయితే వ్యూహం మరోలా ఉండి ఉండేదన్న అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందనుకునే నియోజకవర్గాల్లో లెక్కలు తప్పడానికి కారణం అనూహ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ కావడమేనననే కంక్లూజన్‌కు వచ్చారు పార్టీ సీనియర్లంతా .

త్వరలోనే అధిష్టానానికి నివేది

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిందని, కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్లలో తేడా రావడంపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల కంటే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అవే సెగ్మెంట్లలో తక్కువ ఓట్లు పోలైన అంశాలపైనా సీనియర్లతో లోతుగా చర్చలు జరిగినట్టు సమాచారం. పార్టీ కేడర్ క్షేత్రస్థాయిలో తగినంతగా కష్టపడకపోవడమా? లేదా బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగిందా? లేదా బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ కావడం వల్లనే ఓట్ షేర్‌లో వ్యత్యాసం వచ్చిందా..? ఇలాంటి అంశాలపైనా సీనియర్లు చర్చించుకున్నారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీల వారీగా పడిన ఓట్ల వివరాలకు అనుగుణంగా రహస్య సమీక్ష జరిగింది. దీనిపై అధిష్టానానికి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఓ నివేదిక ఇవ్వనన్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?