Prabhakar Rao talks with leader from AP
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Phone Tapping : ఆ రావు.. ఈ రావు.. రాజీ.. రాగాలు..!

– దుబాయ్‌ నుంచి ప్రభాకర్ రావు రాజీ ప్రయత్నాలు
– దారులన్నీ మూసుకుపోతుండడంతో చివరి అవకాశంపైనే ఆశలు
– పక్క రాష్ట్ర నాయకుడినే నమ్మకుని మంతనాలు
– ఎవరూ పట్టించుకోవడం లేదంటూ గగ్గోలు
– చేసిందంతా తనకోసం కాదంటూ అభ్యర్థన
– పోలీసుల ముందు లొంగిపోయి అప్రూవర్‌ అవుతారా?
– పైరవీలు అంటూ పక్క దేశాల్లోనే తిరుగుతారా?
– ప్రభాకర్ రావు కోసం పరేషాన్ అవుతున్న ఆ లీడర్ ఎవరు?


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసులో ఏ1 గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దుబాయ్‌లో ఉండి చక్రం తిప్పుతున్నారు. కేసు నుంచి తప్పించుకునే మార్గాలపై అన్వేషణ చేస్తున్నారు. దారులన్నీ మూసుకుపోతుండడంతో ఏదో చిన్న ఆశతో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడ్ని పట్టుకుని తప్పుకుంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. తప్పంతా తనదే అన్నట్టు మారిపోయిందని మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ప్రభాకర్ రావు నగరానికి వస్తారా? లేదా?


ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం. ఎంతమందివి చేశారు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇలా అనేక డౌట్స్‌తో ప్రస్తుతానికి పట్టుకున్న ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు.. ఇంకా ఇతర రావుల నుంచి కూపీ లాగుతున్నారు పోలీసులు. అయితే, అందరి వేళ్లు ప్రభాకర్ రావు వైపు చూపుతున్నాయి. క్యాన్సర్ ట్రీట్ మెంట్ అంటూ తప్పించుకుంటున్న ఆయన, నగరానికి వస్తారా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద డౌట్. ఇప్పటికే గతంలో దేశం విడిచి వెళ్లిన వ్యాపారవేత్తల మాదిరిగా లండన్ చెక్కేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. అది వర్కవుట్ కాకపోతే, హైదరాబాద్ రావాల్సి వస్తే ఎలా మసలుకోవాలన్న దానిపై ఆయన ఓ క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది.

పక్క రాష్ట్రం నాయకుడితో చర్చలు

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంకు దగ్గరి మనిషిగా ముద్ర పడిన నేతతో ప్రభాకర్ రావు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్రంలో ఆయన పప్పులు ఉడుకుతాయా? అనేది ఇప్పుడు ప్రశ్న. కాకపోతే అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీ కాబట్టి పని అవుతుందని నమ్ముతున్నారు ప్రభాకర్ రావు. దారులన్నీ మూసుకుపోతుండడంతో చివరి అవకాశంగా ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. చేసిందంతా తన కోసం కాదంటూ ఆ లీడర్‌కు అన్నీ వివరిస్తున్నట్టు సమాచారం. మరి, ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ప్రభాకర్ రావు నగరానికి వస్తారా? లేక, అక్కడక్కడే తిరుగుతుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రెండోరోజు రాధా కిషన్ రావు విచారణ

ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధా కిషన్ రావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే, విచారణ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండోరోజు కస్టడీలో రాధా కిషన్ అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి హైబీపీ ఎక్కువైంది. దీంతో పోలీసులు వెంటనే, వైద్యులను పిలిపించి పరీక్షలు నిర్వహించారు. కేసులో ఏ4 గా ఉన్న ఈయన ఈనెల 10 వరకు పోలీస్ కస్టడీలోనే ఉన్ననున్నారు. మరింత కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

– దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (సీనియర్ జర్నలిస్ట్‌)

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..