Monsoon Blues Telangana Grapples With Dry Spell Fear Many Districts
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana : తెలంగాణపై డ్రైస్పెల్ ఎఫెక్ట్‌

– కరువుకు కారణం అదే
– భారీగా తగ్గిన వర్షపాతం
– అక్టోబరు తర్వాత చినుకే లేదు
– గత పదేళ్లలోనే అత్యల్ప వర్షపాతం


Monsoon Blues Telangana Grapples With Dry Spell Fear Many Districts: తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పొడి వాతావరణ పరిస్థితికి విపక్ష నేతలు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నప్పటికీ, దీనికి అసలు కారణం ‘డ్రైస్పెల్ ఎఫెక్ట్’ అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. గత ఆరు నెలల కాలంలో తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 57.6% తక్కువ వర్షపాతం నమోదైందని, దీని మూలంగానే 2023 మార్చితో పోల్చితే ప్రస్తుతం భూగర్భ జలాలు 2.5 మీటర్ల దిగువకు చేరుకున్నాయని, తెలంగాణలోని ప్రధాన జలాశయాల్లోనూ నీటి నిల్వ బాగా తగ్గిపోయిందని నిపుణులు వివరిస్తున్నారు.

‘డ్రైస్పెల్‌’ అంటే..


సాధారణంగా వర్షాకాలంలో రోజుల తరబడి వాన కురుస్తుంది. దీనివల్ల వాననీరు భూమి లోలోపలకు చేరి భూగర్భ జలాలు వృద్ధి కావటమే గాక వాతవరణంలో తేమ తగుమోతాదులో నిలబడుతుంది. కానీ, ఈ ఏడాది ఒకవానకు మరో వానకు మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చింది. దీనినే డ్రైస్పెల్ అంటారు. దీనివల్ల ముందుకురిసిన వాన ప్రభావం అంతగా భూమ్మీద ఉండదు. దీంతో తర్వాతి కురిసిన వాన భూమి పై పొరలకే పరిమితమవుతుంది.

Also Read: 

తెలంగాణలో గత నేడు నెలకొన్న వర్షాభావ పరిస్థితికి ఇదే ప్రధాన కారణం. గత అక్టోబరు నుంచి 2024 మార్చి కాలంలో తెలంగాణలో 139.9 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 59.2 మి.మీటర్ల వర్షపాతమే రికార్డయింది. అంటే 6 నెలల కాలంలో 57.6 శాతం లోటు ఏర్పడింది. 2023 జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు అంటే కేవలం 4 నెలల్లోనే వానలు కురిశాయి. జులైలో ఎల్‌నినో ప్రభావంతో కురిసిన భారీ వర్షాలే తప్ప నిలకడగా వర్షపాతం నమోదు కాలేదు. అక్టోబరు నుంచి వాన చినుకే లేకుండా పోయింది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు