- 8న ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ
- హాజరుకానున్న పొరుగు దేశాల నేతలు
- ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- 8న దివ్యమైన ముహూర్తం అంటున్న జ్యోతిష్య పండితులు
- మోదీకి కలిసొచ్చిన 8 సంఖ్య
రాజయోగానికి చిహ్నం గా 8 అంటున్న జ్యోతిష్య పండితులు - ఏపీ, తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు 8
- మోదీ జన్మించిన తేదీ సెప్టెంబర్ 17 (1+7=8)
Modi third time Oath taking ceremony on 8th June:
ఎన్డీఏ పక్ష నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నుకుంటూ ఎన్డీఏ సమావేశంలో తీర్మానం తీసుకున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం జరగబోయే ఎన్డీఏ కూటమి కీలక సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ ఎన్డీఏ భేటీకి కూటమిలో ఎంపీలు అంతా హాజరుకావాలని నిర్ణయించారు. రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీఏ నేతలు కోరనున్నారు. దీంతో..8న శనివారం ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న ఉత్కంఠ ఇప్పటికే తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పొరుగు దేశాల నేతలతోపాటు మరికొంత మంది పాల్గొననున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, అమెరికా సహా పలు దేశాల నేతలను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
8వ తేదీకి ఎందుకంత విశిష్టత?
వరసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.0 మంత్రివర్గం కొలువుదీరనుంది. కాగా 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు. 8వ తేదీకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, సంఖ్యశాస్త్ర ప్రకారం ఎలాంటి ప్రాధాన్యం ఉందో తెలుసుకుందాం..
రాజయోగానికి చిహ్నం
సంఖ్యాశాస్త్రంలో 8 శని గ్రహాన్ని చూపుతుంది. ఎనిమిది న్యాయానికి చిహ్నాంగా ఉంటుంది. ఎనిమిది సంఖ్య రాజయోగానికి చిహ్నంగా నిలుస్తోంది. నిజానికి శని ఉన్నవారికి విజయం ఆలస్య అవుతుందని న్యూమరాలజిస్ట్ లు చెబుతున్నారు.
మోదీకి 8తో అనుబంధం
మోదీ 1.0 ప్రభుత్వంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రకటించారు.డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015 సెప్టెంబర్ 26వ తేదీన మోదీ ప్రారంభించారు. తేదీ సంఖ్య 2+6 కలిపితే 8 అవుతుంది. సంవత్సరం 2+0+1+5ని కలిపితే 8 వస్తుంది. ప్రధాని మోదీ సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు. 17వ తేదీని 1+7 కలిపితే 8 అవుతుంది. 8వ తేదీన జన్మించిన వారే కాక ఇతరులు కూడా ఆ రోజున కొత్త పనులు ప్రారంభించొచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 2024 ఏడాదిని 2+0+2+4 కలిపితే కూడా 8 వస్తోంది. జూన్ 8వ తేదీన తిథి విదియ ఉంది. ఆ రోజున కొత్త పనులు చేపడితే మంచి జరుగుతుందని పండితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ గెలుచుకున్న సీట్లు 8, ఏపీలోనూ పది సీట్లలో పోటీచేసిన బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది .