maoists
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Gadchiroli: దండకారణ్యంలో నక్సల్స్ కనుమరుగు- మావోయిస్టు రహిత జిల్లాగా గడ్చిరోలి

మిగిలిన మూడు దళాలను మట్టుపెడతామంటున్న పోలీసులు
ఒకప్పుడు రెండు వేల మంది మావోయిస్టులు


ఆదిలాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: మహారాష్ట్ర(Maharashtra)లోని గడ్చిరోలి(Gadchiroli) జిల్లాలోని దండకారణ్యం(Dandakaranya)లో మావోయిస్టులు(Maoists) కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మావోయిస్టులు తమ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా కేంద్రంగా అనేక ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం ఈ కోటకు బీటలు వారుతున్నాయి. 15 ఏండ్ల క్రితం ఇక్కడ ఇరవై దళాల్లో దాదాపుగా రెండు వేల మంది మావోయిస్టులు ఉండేవారు. ప్రస్తుతం మూడు దళాలే మిగిలాయి. 2026 మార్చి చివరి నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith sha) ప్రకటించి అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్(Action Plan) సిద్ధం చేశారు. అందుకనుగుణంగా అనేక ఎన్ కౌంటర్లు(Encounter) జరుగుతున్నాయి. గత 45 ఏండ్లుగా భద్రతా దళాల(Security Forces)ను అడ్డుకుంటున్న నక్సలైట్లు ఇప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. దాదాపుగా అంతరించే దశకు చేరుకున్నారు.

గడ్చిరోలిలో నక్సలిజం పుట్టింది ఇలా
1980లో ఏపీ నుంచి భారీగా నక్సలైట్లు గడ్చిరోలికి జిల్లాలోని సిరోంచా తాలుకాలోని ప్రవేశించారు. క్రమంగా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల గ్రామాల్లో కార్యకలాపాలను ప్రారంభించారు‌‌. అటవీ అధికారులు, తునికాకు కాంట్రాక్టర్లు, వెదురు రవాణాదారులు ఎలా దోపిడీ చేస్తున్నారో అక్కడి గిరిజనులకు అవగాహన కల్పించి వారిని చైతన్యం చేశారు. దీంతో తునికాకు సేకరించే కార్మికులకు కూలీ పెరిగింది. వెదురు కార్మికుల వేతనాలు సైతం పెరిగాయి. దీంతో ఆయా వర్గాలు మావోయిస్టు పార్టీ వైపు మొగ్గు చూపించారు.


పోలీసులకు సవాల్
మావోయిస్టులు సిరోంచ నుంచి కొరాచి వరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు తాలూకాలను ఆక్రమించారు. గత 45 ఏండ్లలో వారు వందలాది మంది అమాయకులను చంపారన్న విమర్శలు ఉన్నాయి. మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 213 మంది పోలీసులు అమరులయ్యారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు దెబ్బతిన్నాయి. 2018లో భామ్రాగడ్ తాలూకాలోని కసన్సూర్, దమ్రాంచ ప్రాంతాలలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో 40 మంది నక్సలైట్లు హతమయ్యారు. అందులో నక్సలైట్ కమాండర్లు సిను, సైనాథే, సతీశ్ మృతి చెందారు. ఈ జిల్లాలో మావోయిస్టులకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

లొంగిపోతున్న మావోయిస్టులు
ఖోబ్రమెంద ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డివిసి భాస్కర్ కూడా మృతిచెందాడు. 2023లో, మార్డింటోలాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తెలు తుమ్డే సహా 28 మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. అంతేకాక మావోయిస్టు నాయకురాలు నర్మదక్కను, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల నక్సల్ డివిసీలు గిరిధర్, తారక్క లొంగిపోయారు. ఈ 15 సంవత్సరాల్లో పోలీసులు 881 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు ఉద్యమాన్ని కూల్చివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బలమైన చర్యలు చేపట్టింది. ‘దాదలోరా ఖిడ్కీ’ (పోలీస్ దాదా ఖిడ్కీ) అనే చొరవను అమలు చేయడం ద్వారా గడ్చిరోలి పోలీసులు సోషల్ పోలీసింగ్ మార్గాన్ని అమలు చేస్తున్నారు ఎస్పీ. దీని ద్వారా, మారుమూల ప్రాంతాల్లోని వేలాది మంది వెనుకబడిన గిరిజనులకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతరపత్రాలను అందిస్తున్నారు. 2005 నుంచి ఇప్పటివరకు 700 మందికి మావోయిస్టులు లొంగిపోయారు. దండకారణ్యంలో మావోయిస్టులు పుంజుకుంటారా? లేదంటే అంతరించి పోతారా? అన్నది వేచి చూడాలి.

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?