BRS leaders dubai links
సూపర్ ఎక్స్‌క్లూజివ్

BRS Leaders Dubai links: గులాబీ బినామీలంతా.. ఓవర్ టూ దుబాయ్! జోరుగా హవాలా?

కేదార్ మృతితో బయటపడుతున్న లింకులు
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం?
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్‌కు ఆశ్రయమిస్తున్న మాజీ ఎమ్మెల్యే?
హవాలా రూపంలో తరలివెళ్లిన రూ.వేల కోట్లు
ఎమ్మెల్యే యెన్నం ఆరోపణలతో అనేక అనుమానాలు
నిఘా వైఫల్యంతోనే జోరుగా హవాలా?
వారం క్రితం 90 మంది బీఆర్ఎస్ లీడర్లు అక్కడే?
హైదరాబాద్‌కు వచ్చినంత ఈజీగా దుబాయ్‌కు వెళ్తున్న గులాబీ నేతలు


BRS Leaders Dubai links:: తెలంగాణలోని బీఆర్ఎస్ సొమ్మంతా దుబాయ్‌కు చేరుతుందా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. డ్రగ్స్ కేసులో నిందితుడు కేదార్ దుబాయ్‌లో చనిపోయే ముందు పార్టీలు చేసుకుంది బీఆర్ఎస్ నేతలతోనేనని స్పష్టమవుతున్నది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అక్కడ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, సినీ స్టార్స్‌తో రియల్ ఎస్టేట్ చేసేందుకు పక్కా ప్లాన్ వేశారని చెబుతున్నారు. అందుకు దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీని వేడుకగా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 10 ఏండ్ల పాలనలో సంపాదించిన బ్లాక్ మనీ అంతా దుబాయ్‌కి హవాలా రూపంలో వెళ్లడం, అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలను ఏర్పాటు చేయడం 2023లోనే పూర్తి అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కేసులకు భయపడి పోయిన బడా రియల్ ఎస్టేట్ ప్రతినిధి అక్కడే కంపెనీలను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అక్కడికి మనీ ఫ్లోటింగ్ చేశారని తెలుస్తున్నది. దుబాయ్ బిజినెస్ సేఫెస్ట్ అనుకుంటున్న బీఆర్ఎస్ బినామీలు ఇక్కడ ఉన్న ఆస్తులను తక్కువ ధరకు మార్కెట్‌లో పెట్టి హవాలా రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి తోడుగా జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ బినామీలకు అక్కడే ఆస్తులు కొనుగోలు చేయాలని చెప్పడంతో సిరిసిల్లకు చెందిన ఓ బీఆర్ఎస్ నేత హుటాహటిన దుబాయ్‌కి వెళ్లారని స్థానికంగా చర్చ జరుగుతున్నది.

ఎంజాయ్ మూడ్‌లోకి 90 మంది నేతలు


పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు ఎన్నికలు లేవు. దీంతో 90 మంది నేతలు దుబాయ్ బాట పట్టారు. అక్కడ రిలాక్స్ అయ్యేందుకు వెళ్తున్నారు. బ్లాక్ మనీ వైట్‌గా మార్చుకునేందుకు వివిధ బ్యాంకుల్లో లావాదేవీలు ఇక్కడకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బడా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడిచే బిల్డర్స్‌కు చేరువగా పెట్టుబడులు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు రిలాక్స్, ఇటు బిజినెస్ మంత్రం జపిస్తూ, దుబాయ్‌లో బీఆర్ఎస్ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు.

శ్రవణ్‌ను కాపాడుతున్నది ఎవరు?

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ6 గా ఉన్న శ్రవణ్‌కు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అతని మైనింగ్ బిజినెస్, మీడియా, ఇతర లెక్కలు అన్నీ మరో ఎమ్మెల్యే చూసుకుంటున్నారని సమాచారం. అమెరికా నుంచి దుబాయ్, అక్కడి నుంచి అమెరికాకు తిరుగుతూ బిజినెస్‌ను పెంచుకుంటున్నారు తప్ప, తప్పు చేసినట్లు ఎక్కడా పశ్చాత్తాపం పడటం లేదని తెలుస్తున్నది. ఇక్కడ చాలామందికి అప్పులు చెల్లించాల్సి ఉన్నా, ఈ వంకతో తప్పించుకుంటున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ మాజీ మంత్రికి చెందిన సొమ్మును మైనింగ్‌లో పెట్టించి ఇరికించారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటికీ రక్షణగా ఓ మాజీ ఎమ్మెల్యే ఉండటం అశ్చర్యానికి గురి చేస్తున్నది. కేదార్ కేసు విచారణ చేస్తే వీటన్నింటికీ సమాధానం దొరుకుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు.

Just In

01

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!