IT Raids Dal Scam (imagecredit:twitter)
తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

IT Raids Dal Scam: దాల్ స్కామ్‌లో హిందుస్థాన్‌తోపాటు హాకా.. త్వరలోనే ఐటీ దాడులకు ఛాన్స్!

IT Raids Dal Scam: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఐటీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు. రూ.300 కోట్ల పప్పు వ్యాపార కుంభకోణానికి సంబంధించి ఏపీలోని గుంటూరు(Gunturu), విజయవాడ(Vijayavada), కర్నూలు(karnulu), విశాఖపట్నం(Vishakapatnam), తెలంగాణలోని హైదరాబాద్(Hyderabad), మహబూబ్‌నగర్(Mahabubnagar) సహా దాదాపు 25 చోట్ల పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారుల నివాసాల్లో రెయిడ్స్ నిర్వహించారు. వారు చేస్తున్న వ్యాపారానికి రికార్డుల్లో చూపించే లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోవడాన్ని గమనించి ఐటీ అధికారులు ఈ మెరుపు సోదాలకు దిగారు.


బీఆర్ఎస్ హయాం నాటి వ్యవహారం

గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో పలు వ్యాపార సంస్థలు భారీగా నగదు లావాదేవీలు జరిపాయని అధికారులు ఆరోపిస్తున్నారు. దర్యాప్తులో 2024 ఎన్నికల సమయంలో గణనీయమైన నగదు ఉపసంహరణకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయి. పప్పు సరఫరా కోసం పలు కంపెనీలు పౌరసరఫరాల శాఖ నుంచి అనుమతులు పొందినప్పటికీ సరుకులను పంపిణీ చేయడంలో విఫలమయ్యాయని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. గతంలో ఇదే కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని హిందుస్థాన్ ట్రేడర్స్(Hindustan Traders), కర్నూలులోని వీకేర్(Vcare) గ్రూప్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Also Read; Hydraa: హైడ్రాకు హై కోర్టు అభినందనలు.. ప్ర‌శంసించిన జ‌స్టిస్ విజ‌య్‌సేన్‌రెడ్డి


కీలకంగా హాకా.. మచ్చ శ్రీనివాసరావు

హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌.. షార్ట్ కట్‌లో హాకా. దీనికి గతంలో చైర్మన్‌గా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చెందిన మచ్చ శ్రీనివాసరావు(Macha Srinivasa Rao) అనేక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దాల్ స్కామ్‌లో హిందుస్థాన్ ట్రేడర్స్‌తో పాటు హాకా పాత్రపై అనుమానాలున్నాయి. దీనికి సంబంధించి ‘స్వేచ్ఛ’ పలు కథనాలు ఇచ్చింది. తాజాగా ఐటీ అధికారులు సోదాలకు దిగడంతో నెక్స్ట్ టార్గెట్ హాకా, మచ్చ శ్రీనివాసరావు అనే ప్రచారం జరుగుతున్నది.

Also Read: Hydraa: హైడ్రాకు హై కోర్టు అభినందనలు.. ప్ర‌శంసించిన జ‌స్టిస్ విజ‌య్‌సేన్‌రెడ్డి

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..