Hyderabad ,Metro, Nogole .chandrayana gutta : కొత్గగా 13 మెట్రో స్టేషన్లు
Metro Hyderabad
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad :హైదరాబాద్‌లో కొత్తగా 13 మెట్రో స్టేషన్లు

  • నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ మెట్రో మార్గం
  • ప్రయాణికులకు అందుబాటులో మరో 13 మెట్రో స్టేషన్లు
  • పబ్లిక్ సలహాలు, సూచనలు తీసుకున్న మెట్రో అధికారులు
  • మహాలక్ష్మి పథకంతో భారీగా తగ్గిన మహిళా ప్రయాణికులు
  • ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు మెట్రో అధికారుల కసరత్తు
  • మెరుగైన సదుపాయాలను కల్పించాలనే యోచన

Hyderabad Metro Nogole chandrayana gutta 14 k.m.13 Stations:
హైదరాబాద్ వాసులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్మపారు. మెట్రో ఫేజ్-2కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఫేజ్-2లో మొత్తం 13 మెట్రో స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. నాగోల్ మెట్రో స్టేషన్‌తో ప్రారంభమై.. నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌ కూడలి, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట రోడ్‌ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మెట్రో రైలు ఎలైన్‌మెంట్, స్టేషన్ల ఏర్పాటుకు ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచనలు చేశారు.


తగ్గుతున్న మహిళా ప్రయాణికుల సంఖ్య

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ స్కీమ్​, హైదరాబాద్​ మెట్రోపై ప్రభావం చూపుతోంది. ఇదివరకు మహిళలు, స్టూడెంట్స్ ఎక్కువగా మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు. ప్రస్తుతం మహాలక్ష్మీ స్కీమ్​ వల్ల ఫ్రీ బస్​ కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతేడాది 5 లక్షలకు పైనే ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 5 శాతం వరకు తగ్గినట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. సిటీలో ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల సంఖ్య 12 లక్షలకు చేరింది.


5.10 లక్షల నుంచి 4.80 లక్షలకు తగ్గింది

సిటీలో ట్రాఫిక్ సమస్యలతో ఎక్కువ శాతం ప్రజలు మెట్రోను ఎంచుకునేవారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగస్తులు, యువతులు మెట్రో రైల్లో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపేవారు. మెట్రో ప్రారంభించిన 2017 ఏడాది నుంచి క్రమంగా ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. హైదరాబాద్​ మెట్రో ప్రారంభ దశలోనే రెండు లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో తమ గమ్యస్థానాలకు చేరేవారు. గతేడాది రోజుకు సగటున 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. గతేడాది నవంబర్ లో ఒకే రోజు మెట్రోలో 5.47 లక్షల మంది ప్రయాణించారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క