Hyderabad Metro
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last year:


నిత్యం అనేక వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది హైదరాబాద్ మెట్రో.తొలినాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తూ మరో పక్క ప్రయాణికుల అవసరాలు తీరుస్తూ దూసుకుపోతోంది. అయితే హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆదాయం ఏకంగా 105 శాతం పెరిగిందని నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ మెట్రో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1407-81 కోట్ల రాబడి వస్తే గత ఆర్థిక సంవత్సరానికి రూ.703.20 కోట్లు మాత్రమే వచ్చింది.

కోవిడ్ టైమ్ లో భారీ నష్టాలు


గడిచిన ఆరేళ్లుగా హైదరాబాద్ సిటీలో మైట్రో రైళ్ల వ్యవస్థను నడుపుతున్నారు. కోవిడ్ సమయంలో మెట్రో భారీగా నష్టాలను చవిచూసింది. 2022 మార్చి 31 నాటికి రూ.4108.37 కోట్లు ఉండగా 2023 కు వచ్చేసరికి రూ. 5424.37 కోట్లకు చేరుకుంది. ఇక ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.5979.36 కోట్లకు చేరుకుందని ఎల్ అండ్ టీ వెల్లడించింది.

రెండు నెలలుగా పెరిగిన ప్రయాణికులు

ఎండల ప్రభావం ఒక్కటేకాదు..సమయం కలిసి వస్తుందనుకునే వారి సంఖ్య పెరగడంతో మెట్రోకు ఆదరణ తగ్గడం లేదు. సోమవారం ఉదయం రోజువారీ కంటే ముందే సేవలు ప్రారంభిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సేవలను పొడిగించారు. గత రెండు నెలలలో చూస్తే 1,23,95,205 మంది మెట్రోలో ప్రయాణించారు. అంటే రోజువారి సగటున చూస్తే 4.13 లక్షల మంది ప్రయాణించారు. మే నెలలో 1,31,05,805 మంది ప్రయాణించారు. రోజువారి సగటున 4.22 లక్షల మంది ప్రయాణించారు. రద్దీకి తగినట్టు లేక…: ప్రయాణికుల సంఖ్య 6 లక్షల మందికి పెరగాల్సి ఉందని మెట్రో వర్గాలు అంటుంటే…ఉదయం, సాయంత్రం కార్యాలయాల వేళల్లో విపరీతంగా రద్దీ ఉంటోందని దానికి సరిపడా మెట్రోలు లేవని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!