Train Journey with Children: మనం చిన్నపిల్లలతో రైలు ప్రయాణం సాగిస్తూ ఉంటాం. ఆ సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మనం ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు, మన ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందట.
రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రధానంగా చిన్న పిల్లలకు ట్రైన్ జర్నీ అంటే అమిత ఇష్టం. అందుకే ఎవరైనా సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ట్రైన్ జర్నీ సాగిస్తారు. అయితే ఆ సమయంలో మన వెంట చిన్నారులు ఉంటే, మనం కాస్త జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిందే. ఆ జాగ్రత్తలపై అవగాహన లేకుంటే మనం పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అందుకే రైలు ప్రయాణం సురక్షితంగా సాగాలంటే రైల్వే రూల్స్ పాటించాల్సిందే. అలాగే చిన్న పిల్లలు వెంట ఉన్న సమయంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సజావుగా సాగుతుంది.
చిన్నపిల్లలతో రైలు ప్రయాణానికి ముందు..
5 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. కానీ సీటు రిజర్వేషన్ కావాలంటే చైల్డ్ టికెట్ తీసుకోవాలి. స్లీపర్ లేదా 3AC ప్రయాణానికి ఎక్కువ మంది పిల్లలకి సౌకర్యంగా ఉంటుంది. అందుకే మనం ఈ ఆప్షన్ తీసుకోవాలి. పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక చిన్న బ్యాగ్, నాప్కిన్లు, టిష్యూస్, శుభ్రతా వస్తువులు, మిల్క్ బాటిల్, ఫ్లాస్క్, చిన్న టాయ్స్, బుక్స్, మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు మనం వెంట ఉంచుకోవాలి.
ప్రయాణ సమయంలో జాగ్రత్తలు..
పిల్లలు కిటికీల వద్ద, డోర్ల వద్ద నిద్రపోకుండా చూడాలి. పిల్లల చేతులు, కాళ్లు కిటికీ బయటకు పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఫోన్, బ్యాగ్స్ వారికి ఇవ్వకుండా ఉండడమే విశేషం.
బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసిన ఫుడ్ చాలా మంచిది. IRCTC ఫుడ్ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉంటే, మాత్రమే ట్రస్టెడ్ వెండర్ల నుంచి చేయాలి. వాటర్ బాటిల్స్ కొనుగోలు సమయంలో సీల్ తీసి ఉందా? లేదా అన్నది గమనించాలి.
ఇవి తీసుకెళితే మంచిది
పిల్లలతో ట్రైన్ జర్నీ సమయంలో మనం చిన్న కథల పుస్తకాలు, కలర్ బుక్స్, చిన్న టాయ్స్ తీసుకుపోవడం ద్వారా వారికి సమయం కనిపించదు. మొబైల్ యాప్‌లలో చిన్నపిల్లలకు అవసరమైన వీడియోలు ముందుగా డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. బోర్ కాకుండా కొన్ని చిన్న గేమ్స్ ప్లాన్ చేస్తే బాగుంటుంది.
ఆరోగ్యమే ప్రాధాన్యం
చిన్నారులు మనతో పాటు ప్రయాణించే సమయంలో బేసిక్ మెడికల్ కిట్ మన వద్ద ఉండాలి. ఫీవర్, జలుబు, వాంతుల మందులను కలిగి ఉండడం ద్వారా అత్యవసర సమయంలో మనం వీటిని వినియోగించవచ్చు. అంతేకాదు డాక్టర్స్ సలహా తీసుకొని మందులు తీసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా అత్యవసర సమయంలో వైద్య సదుపాయం కొరకు రైల్వే హెల్ప్ నంబర్లు 182, 139 లను సంప్రదించాలి.
Also Read: Case Against Aghori: లేడీ అఘోరీ ఆ పూజ చేస్తోందా? మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు..
ఇక రాత్రి వేళ..
రాత్రి ట్రైన్ జర్నీలో ఉన్న సమయంలో పిల్లలు కప్పుకున్నారా, సరిగ్గా నిద్రపోతున్నారా లేదా అనేది తప్పక గమనించాలి. ఎవరైనా అపరచిత వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు తినకూడదని పిల్లలకు ఉదాహరణల ద్వారా వివరించాలి. అంతేకాకుండా రాత్రి వేళ పిల్లల వద్ద ఒకరు కాపలాగా ఉండడం మంచిది.
తల్లిదండ్రుల కోసం..
పిల్లలను ట్రైన్ వద్దకు తీసుకు వచ్చిన సమయంలో మన ట్రైన్ గుర్తులు, మన సీటు గుర్తులు చెప్పడం ముఖ్యం. ఇలా చేస్తే పిల్లలు మనం ఆదమరచిన సమయంలో తప్పిపోయినా వారు వెనక్కు వచ్చేందుకు ఇది దోహదపడుతుంది. అలాగే పిల్లల చేతి మీద మీ ఫోన్ నంబర్, పేరెంట్స్ నేమ్ రాసిన స్టిక్కర్ వేస్తే తప్పిపోయిన సమయంలో పిల్లలు త్వరగా మన చెంతకు చేరుతారు.