wine shops close
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana:రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు బంద్

Election results 2024 telangana statewide wine shops close:
తెలంగాణలోని మందు ప్రియులకు మరోసారి బిగ్ షాక్ తగలనుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా డ్రై డేగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉండనున్నట్లు పేర్కొంది. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి నిరాకరించింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులను మూసి ఉంచనున్నారు. కొన్ని జిల్లాల్లో మూడు రోజులు వైన్స్‌లను బంద్ ఉంచనున్నారు. అభ్యర్థుల ఇళ్లు, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచనున్నట్లు ఈసీ తెలిపింది. తెలంగాణలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


బార్లు, పబ్ లు మూసివేత
దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా అదే రోజు రిజల్ట్స్ వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హైదరాబాద్‌లోని బార్లు, పబ్‌లు మూసేయాలని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా.. గత నెల రోజుల్లో చాలాసార్లు మద్యం దుకాణాలు బంద్ చేశారు. మే 13న పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు క్లోజ్ చేశారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 12 జిల్లాల్లో మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేశారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల కౌటింగ్ నేపథ్యంలో మరోసారి మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి.


Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్