Harithaharam Scam brs
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad:ఆపరేషన్ హరిత ‘ఆహారం’?

  • ఇకపై వన మహోత్సవంగా హరితహారం
  • కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం
  • గత పదేళ్లుగా హరితహారం కింద రూ.11,747 కోట్ల ఖర్చు పెట్టిన బీఆర్ఎస్
  • 292 కోట్ల మొక్కలు నాటినట్లు రికార్డులు
  • 75 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఘనంగా వేడుకలకు సిద్ధం
  • హరితహారం పేరిట గత పాలకులు నిధుల దుర్వినియోగం
  • మొక్కలకు ఖర్చెపెట్టిన లెక్కలపై రేవంత్ సర్కార్ ఆరా
  • కోట్లలో మొక్కలు నాటినా తెలంగాణలో పచ్చదనం శూన్యం
  • హరితహారం నిధుల దోపిడీపై వివరాల సేకరణలో అధికారులు

Congress government change the name of Harithaharam into Vana mahotsavam:


తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా వర్షాకాల ఆరంభంలో చేపట్టే ఈ మొక్కలు నాటే కార్యక్రమం బీఆర్ఎస్ హయాంలో హరితహారంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాత ఆనవాళ్లను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ పథకానికి ఒకప్పుడు ప్రారంభంలో పెట్టిన పేరునే కొనసాగించే ప్రక్రియ చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించేవారు. 1950 లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా..ఈ సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంలో తాజాగా ఈ కార్యక్రమానికి‘వజ్రోత్సవం వన మహోత్సవం’ గా నిర్వహించనుంది. పనిలో పనిగా గత పదేళ్లుగా మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కొంత మందికి హరిత ఆహారంగా మారింది. హరిత హారం కార్యక్రమంలో నిధులను కైంకర్యం చేసి మొక్కుబడిగా హరిత కార్యక్రమం నిర్వర్తించి అందినకాడికి నిదులు దోచుకున్నవారిపై కాంగ్రెస్ సర్కార్ నజర్ పెట్టనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని అంశాల్లో కమిటీ వేసి విచారణ జరిపిస్తోంది. మరికొన్ని వాటిపై ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

హరితహారం నిధుల కైంకర్యంపై కాంగ్రెస్ దృష్టి


బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన హరిత హారం పథకంపై నూతన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో నాటిన మొక్కలు, చేసిన ఖర్చు, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు కమిటీ వేయాలని భావిస్తోంది. అంతకుముందే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల గ్రామాలు, ప్రాతినిథ్యం వహించినన నియోజకవర్గాల్లో పథకం అమలు తీరుపై అధ్యయనం చేయాలని సర్కార్​ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

292 కోట్ల మొక్కులు
2015-16 నుంచి తొమ్మిది విడతలుగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ పథకం కింద ఇప్పటి వరకు 292 కోట్ల మొక్కలు నాటినట్లు, రూ.11,747 కోట్ల ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్న నేపథ్యంలో వ్యయానికి అనుగుణంగా ఫలితాలు రాలేదనే అనుమానాలను సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రి వ్యక్తం చేసినట్టు సమాచారం. . విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హరితహారం పథకంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు భావిస్తున్నారు. నాటిన మొక్కలకు రెండింతలు రికార్డుల్లో నమోదు చేయడం, ఆ తర్వాత ఆ మొక్కలు చనిపోయాయని పేర్కొంటూ మళ్లీ మొక్కలు నాటినట్లు చూపడం వంటివి జరిగాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా నిధుల దుర్వినియోగంపై కమిటీ వేద్దామని ఆమె ఈ సందర్భంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి సీఎం స్పందించి వందల కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలున్నాయని, ఆ స్థాయిలో పచ్చదనం పెరగలేదని అన్నారు.

అగ్రనేతల నియోజకవర్గాలపై ఫోకస్

కేసీఆర్ , కేటీఆర్, హరీశ్​రావులాంటి కీలక నేతల నియోజకవర్గాలు, వాటి పరిధిలోని గ్రామాలలో నర్సరీలు నెలకొల్పేందుకు చేసిన ఖర్చు, నాటిన మొక్కలు, ప్రస్తుత పరిస్థితిపై వాస్తవాలు తేల్చాలని ఆదేశించారు. ఆయా పంచాయతీల పరిధిలో నాటిన మొక్కలెన్ని, ప్రస్తుతం ఉన్నవి ఎన్ని అనేది తెలియాలని అన్నట్లు సమాచారం. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని తన కార్యదర్సిని ఆదేశించినట్లు తెలుస్తోంది. . ప్రస్తుతానికి హరిత హారం పథకం విషయంలో కమిటీ వేసేందుకు నిర్ణయం తీసుకోలేదని, ప్రాథమికంగా కొన్ని గ్రామాల్లో అధ్యయనం చేసి, అందులో తేలిన అంశాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిపై కమిటీ వేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు