Rythu Bazaar ( Imgae Source: Twitter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Rythu Bazaar: ఇది రైతు బజార్ కాదు.. రాజకీయ బజార్.. వ్యాపారస్తుల కష్టాలు తీరేది ఎన్నడో?

Rythu Bazaar: కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పల్లెలు అధికంగా ఉండడం కారణంగా వ్యవసాయ ఆధారిత రైతులు చాలా మంది తమ పొలాల్లో కూరగాయలు పండిస్తూ ఆ కూరగాయలు కొత్తగూడెం పట్టణంలో కూరగాయల వ్యాపారం చేసుకునే వ్యాపారులకు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్న రైతులు అధికంగా ఉన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన కూరగాయలను వ్యాపారులు గత 40ఏళ్లుగా కొత్తగూడెం పట్టణం లోని MG రోడ్, సెవెన్ హిల్స్, చిన్న బజార్, నేతాజీ మార్కెట్ లలో కూరగాయలు అమ్ముకొని తమ కుటుంబ పోషణ బతుకుదెరువు సాగిస్తున్న వ్యాపారులు వందల మంది ఉన్నారు..,


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో..

1999వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక బృహత్తర కార్యానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడంతో రోడ్ల మీద ఇబ్బందులు పడుతూ కూరగాయలు అమ్ముకునే రైతులు, వ్యాపారుల కోసం రైతుబజార్లు ఏర్పాటు చేయాలనే ధ్యేయంతో పనులు మొదలుపెట్టారు.


కొత్తగూడెంలో రైతు బజార్ కోసం

కొత్తగూడెం రైతు బజార్ ను 2002వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే వారిని రైతుబజార్లో మాత్రమే కూరగాయలు అమ్మలనే కఠిన నిబంధనలు పెట్టి కూరగాయల వ్యాపారం చేసుకునే రైతులను, వ్యాపారులను రైతు మార్కెట్లలోకి తరలించదండం జరిగింది.

టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత

అలా రైతు మార్కెట్లలో వ్యాపారాలు చేసుకుంటున్న తమ జీవితాలు సాగిస్తున్న రైతులు, వ్యాపారస్తులకు మళ్లీ ఒక అడ్డంకు వేసి ఇంటిగ్రెటెడ్ మార్కెట్ల పేరిట అప్పటి టి ఆర్ ఎస ఆ రైతు మార్కెట్ ను 2023 జనవరి 3వ తేదిన కూల్చివేయడం జరిగింది.

ఇంటిగ్రేడ్ మార్కెట్ కోసం రైతుల షాపులను పక్కన స్థలం కు తరలింపు చర్యలు

ఇప్పుడున్న మార్కెట్ మాకు చాలు అంటూ రైతులు, వ్యాపారుల, ప్రతిపక్ష మరియు వామపక్ష నాయకుల విన్నవించిన కూడా వారి గోడు వినకపోవడంతో ఆందోళనలు, రాస్తా రోకోలు, ధర్నాల తో అప్పటి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర్లు అక్కడ వ్యాపారం చేసుకునే రైతులకు పక్కనే ఖాళీగా ఉన్న సింగరేణి క్వాటర్స్ స్థలాన్ని సింగరేణి అధికారులతో మాట్లాడ ఇంటిగ్రెటెడ్ రైతుబజార్ పూర్తి అయ్యే వరకు రైతులు, వ్యాపారులను ఇక్కడ ఉన్న సింగరేణి స్థలాన్ని ఉపయోగించుకునేలా మాట్లాడి వ్యాపారులకు ఇప్పించడం జరిగింది. సింగరేణి స్థలం కోసం సింగరేణి యాజమాన్యం దగ్గర సరి అయిన అనుమతులు తీసుకపోవడం వలన మార్కెట్ కట్టడాలను అడ్డుకున్న సింగరేణి అధికారులు.

ఇప్పుడు రైతు బజార్ పై అసలైన రాజకీయం మొదలైంది

ఇక్కడినుండే అసలైన రాజకీయం మొదలైంది. రాజకీయ నాయకులు తమ కమిషన్ల కక్కుర్తి కోసం ఖాళీగా ఉన్న సింగరేణి స్థలాల్లో ఫ్రూట్స్ మార్కెట్, ఫిష్ మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్లు నిర్మించడం మొదలుపెట్టారు. ఆ నిర్మాణాలు సగంలోనే సింగరేణి అధికారులు అడ్డుకోవడం జరిగింది. సింగరేణి యాజమాన్యం అనుమతి లేకుండా సింగరేణి భూముల్లో మార్కెట్ కట్టడం ఏంటి అంటూ.. మార్కెట్ నిర్మించే ఈ స్థలం సింగరేణిది ఇక్కడ మున్సిపాలిటీ కట్టడాలు ఎలా కడతారు. అని అక్కడ జరిగే పనులను ఆపివేయడం అక్కడకు వచ్చిన రైతులను, వ్యాపారులను సింగరేణి అధికారులు ఖాళీ చేయించడం చక చక జరిగిపోయాయి.

మళ్లీ రోడ్డు పాలైన రైతులు వ్యాపారస్తులు రోడ్డెక్కి పరిస్థితి మొదలైంది

రైతులకు,వ్యాపారస్తులకు కూరగాయలు అమ్ముకునే స్థలం లేకుండా పోవడం ధ్వరా అక్కడ వ్యాపారం చేసుకునే వందల మంది జీవితాలు రోడ్డున పడడం జరిగింది.ప్రభుత్వ భూమిలో ఉన్న రైతుబజార్ ను మార్చి సింగరేణి స్థలంలో జరిపి కట్టడం కరణంగా రైతులకు, వ్యాపారులకు అందరికీ మోసం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి డేరాలు కట్టుకొని సింగరేణి స్థలంలో వ్యాపారం చేస్తున్న రైతులు వ్యాపారస్తులు సింగరేణి అధికారులు ఏ క్షణంలో గెంటేస్తారు. తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇంటిగ్రేడ్ మార్కెట్ పేరిట కట్టడాలు పూర్తి కాకపోవడం వలన రైతులను వ్యాపారస్తులను గోసపుచ్చుకుంటున్నారని ఇక్కడ ఎవరి స్వార్థం వారిది ఎవరికి దొరికింది వారు కోట్లు దండుకుంటూ నారు కానీ పూర్తికాని మార్కెట్ ఇందులో ఎవరి పనితనం ఎలాంటిదో తేలాల్సి ఉన్నది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?