CCS Is A Care of For Corruption And A Stop To Crores of Rupees Scams
సూపర్ ఎక్స్‌క్లూజివ్

CCS Scam: అవినీతికి కేరాఫ్ సీసీఎస్, కోట్ల స్కాములకు అడ్డా

– రాత్రికి రాత్రే ఫైల్స్ మాయం చేసే మాఫియా
– పై అధికారులకు కాసుల పంట
– సీసీఎస్ కేంద్రంగా అవినీతి దందా
– మొన్న ఉమామహేశ్వర్ రావు.. ఇప్పుడు సుధాకర్.. నెక్ట్స్ ఎవరు?
– అవినీతి అధికారులను పసిగట్టలేకపోతున్న ఐపీఎస్‌లు
– సీపీ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ శ్వేత హానెస్ట్‌గా ఉంటే సరిపోతుందా?
– డీసీపీలకు బినామీలుగా ఏసీపీలు, సీఐలు
– ఆర్ధిక నేరాల్లో భారీగా సొమ్ము చేసుకుంటున్న ఆఫీసర్లు
– వందల కోట్ల స్కాముల్లో వివరాలు దాచి సొమ్ము చేసుకుంటున్న వైనం
– ఫేక్ డాక్యుమెంట్స్, ఫోర్జరీస్, చీటింగ్స్‌పై ఫోకస్ లేని సీసీఎస్
– పోలీస్ శాఖ ప్రక్షళన దిశగా రేవంత్ ప్రభుత్వం
– అవినీతి మూలాలను తవ్వేందుకు సిద్ధం
– ప్రజలతో సంబంధం ఉండే డిపార్ట్‌మెంట్లపై ఫోకస్


-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం

CCS Is A Care of For Corruption And A Stop To Crores of Rupees Scams: రాష్ట్రం బాగుండాలంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి. అలా జరగాలంటే పోలీసులు సవ్యంగా నడుచుకోవాలి. లేదంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సీసీఎస్ కేంద్రంగా సాగుతున్న దందాలను చూస్తుంటే అవినీతికి అడ్డూ అదుపు లేదనిపిస్తోంది. పోలీస్ శాఖలో వందల కోట్ల స్కాం ఫైల్స్ మిస్ అవుతున్నాయి. అందుకు సీసీఎస్ పోలీస్ స్టేషన్ అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతికి అలవాటు పడ్డ అధికారులు వాటిని మిస్ యూజ్ చేస్తున్నారు. చార్జిషీట్ వేయడంలో అలస్యం చేస్తూ, కోట్ల రూపాయల లంచం తీసుకుంటున్నారు. కేసును వీక్ చేయడానికి ఓ లెక్క, తప్పించడానికి మరో లెక్క, ఇలా అవినీతిని పంచుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే, బాధితుల తరుఫున కూడా డబ్బులు తీసుకోవడం ఇక్కడి స్పెషల్. అందుకే ఏసీపీ ఉమామహేశ్వర్ రావు విచారణలో ఎన్నో విషయాలు బట్టబయలు అయ్యాయి. అల్వాల్ ఏరియాలో దొరికిన 30 లక్షలు ఓ ఎస్పీ స్థాయి అధికారివి అని తెలిసింది. సందీప్ అనే అధికారికి ఈయనకు మధ్య బినామీ లావాదేవీలు ఉన్నాయి. ఈయన కాస్ట్లీ ఏరియాలో డీసీపీగా చేయడం, కేసులు వస్తే, అక్కడ నుంచి హైదరాబాద్ సీసీఎస్‌కి వెళ్లడం, అక్కడ రాయబారం నడిపించడం లాంటివి ఎన్నో జరిగాయని పోలీసుల విచారణలో తేలింది. కోట్లాది రూపాయలు తీసుకుని సెటిల్మెంట్స్ చేయడమే పనిగా ఇన్నాళ్లూ సీసీఎస్‌ని వాడుకున్న అధికారులు ఉన్నారంటే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిందో అర్థమవుతోంది.


వందల కోట్ల ఫైల్‌లో సగం సగం విచారణ

గజం భూమి కూడా దొరకని ప్రాంతంలో ఎకరాల భూమిని ఫోర్జరీ సంతకాలు, ఫేక్ క్యాడిండెట్స్ రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పటికీ ఆ కేసుల్లో అతీగతీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన రియల్ మాఫియా ఆగడాలను, ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వందల, వేల కోట్ల స్కాముల్లో అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదం ఉంటే నేరాన్ని గుర్తించి శిక్షించాల్సిన పోలీసులు, ఖరీదైన ఫైల్‌తో వ్యాపారం చేసినట్లు ఇప్పటికే కొంత మంది బాధితులు గుర్తించారు. అయితే, సెటిల్మెంట్లకు అడ్డాగా ఏసీపీలు, సీఐలు వ్యవహారించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పసిగట్టింది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖకు హెచ్చరిస్తోంది. తప్పించుకున్న నిందితులు మళ్లీ మోసాలకు పాల్పడుతూ, విద్రోహ శక్తులుగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్.

ఆఫీసర్స్ అలర్ట్

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని తప్పిదాలు చేసినా, తమ వారనుకుంటే ఇట్టే వదిలేశారు. అదంతా ఒక మాఫియాలా నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి వాటికి అస్కారం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, సమీక్షించే అధికారం ప్రతి ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఉంది. సీపీ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ శ్వేత హానెస్ట్‌గా ఉంటే సరిపోదు. కిందిస్థాయి సిబ్బందిని అలర్ట్ చేసి హానెస్ట్‌గా ఉంచాలనే మాట వినిపిస్తోంది. మొన్న ఏసీపీ ఉమామహేశ్వర్ రావు, ఇప్పుడు ఇన్స్పెక్టర్ సుధాకర్, తర్వాత మరో అధికారి, ఇలా లంచాలు మేస్తూ పోతే ఎలా? ఉన్నతాధికారులు ఇలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే సూచన సర్వత్రా వినిపిస్తోంది.

ఏసీబీ విచారణకు సీసీఎస్ ఏసీపీ

3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ సుధాకర్ కేసులో సీసీఎస్ ఏసీపీ రామ్‌ రెడ్డిని విచారణకు పిలిచింది ఏసీబీ. లంచం కేసులో ఆయన పాత్రపై విచారిస్తున్నారు అధికారులు. చీటింగ్ కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షలు ఇవ్వాలని సీఐ సుధాకర్ డిమాండ్ చేశాడు. గతంలో 5 లక్షల లంచం తీసుకున్నాడు. మిగతా డబ్బులు ఇవ్వాలని బాధితులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ కేసులో ఏసీపీ రామ్ రెడ్డి పాత్రపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ ఆయనకు కబురు పెట్టింది. రామ్ రెడ్డి పాత్రపై ఆధారాలు దొరికితే అరెస్ట్ చేయనున్నారు అధికారులు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్