Case Filed On Kalvakuntla Kanna Rao in Adibatla Police Station
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Kalvakuntla kannarao : కల్వకుంట్ల కన్నా‘రావు’ కబ్జా..!

– కేసీఆర్ అన్న కొడుకు కబ్జా బాగోతం
– ఆదిభట్ల పీఎస్ పరిధిలో 2 ఎకరాల చుట్టూ వివాదం
– ఫెన్సింగ్ తొలగించి షీట్స్‌కు నిప్పు
– కన్నారావు సహా 38 మంది బీఆర్ఎస్ లీడర్లపై కేసులు
– ముగ్గురి అరెస్ట్.. పరారీలో 35 మంది
– కన్నారావు బెంగళూరులో ఉన్నట్టు అనుమానం


Case Filed On Kalvakuntla Kanna Rao : వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా అన్నీ అందుతాయి అంటారు. ఇది రాజకీయాలకు ఎక్కువగా వర్తిస్తుంది. అధికారంలో ఉన్నది మనోడైతే తెలిసిన వాళ్లు ఆడిందే ఆటగా సాగిస్తుంటారు. కేసీఆర్ పాలనలో ఇలాంటివి చాలానే చూశాం. తాజాగా మరో బాగోతం బయటపడింది.

మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్ రావు భూకబ్జా వెలుగులోకి వచ్చింది. ఆదిభట్ల ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్‌కు చెందిన భూమిలో ఫెన్సింగ్ ధ్వంసం చేసి కబ్జా పెట్టినట్టు ఆయనపై కేసు నమోదైంది. సదరు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ ఫిర్యాదు చేశారు. ఇందులో కన్నారావుతోపాటు 38 మంది బీఆర్ఎస్ నాయకుల ఇన్వాల్వ్‌మెంట్ ఉండడంతో కేసులు నమోదు చేశారు పోలీసులు.


ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఎకరాల భూమికి సంబంధించి ఈ వివాదం రాజుకుంది. ఆ భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు ప్రయత్నిస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి హద్దు రాళ్లు పాతినట్టు తెలిపాడు. ఫెన్సింగ్‌కు ఉన్న షీట్స్‌ను తగులబెట్టినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు కన్నారావు సహా మిగిలినవారిపై 307, 447, 427, 436, 148, 149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

కన్నారావు బెంగళూరులో ఉన్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కన్నారావు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసేవాడని, దీనికోసం అల్వాల్‌లో ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. మాజీ నక్సలైట్లతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకొని సెటిల్మెంట్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బెదిరించిన ఫోన్ కాల్ ఒకటి అప్పట్లో వైరలైంది. కన్నారావు ఆగడాలను గత ప్రభుత్వంలో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?